Begin typing your search above and press return to search.
హీరోయిన్ ను ద్రౌపది అనేసిన కమల్
By: Tupaki Desk | 15 July 2017 5:24 AM GMTసినిమా నటి కిడ్నాప్ ఉదంతంలో మలయాళ హీరో దిలీప్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసు బాగా సంచలనం అయిపోయింది. అయితే.. ఈ కేసు విషయంలో మొదట్లోనే మలయాళ హీరోయిన్ పేరు ఉపయోగించేసిన మీడియా.. ఆ తర్వాత తమకేం తెలియనట్లుగా ఒక నటి అంటూ కథనాలు వండి వారుస్తోంది.
లైంగిక వేధింపుల కేసులో నిందితురాలి పేరును బయటకు చెప్పకూడదనే రూల్ ఉండడమే ఇందుకు కారణం. అయితే.. ఈ కేసుపై స్పందిస్తూ సీనియర్ నటుడు కమల్ హాసన్.. ఆమె ఒక మహిళ కావడంతోనే మద్దతు పలుకుతున్నామని.. అంతే తప్ప ఒక సినిమా నటి అనే ఉద్దేశ్యంతో కాదని చెబుతూ.. భావన అంటూ పేరు పైకే చెప్పేశారు కమల్ హాసన్. ఆ సందర్భంలో పేరు పైకి చెప్పకూడదనే విషయాన్ని మీడియా గుర్తు చేస్తే.. 'నేను ఆమె పేరు ఉపయోగించానా లేదా అన్నది ముఖ్యం కాదు. ఆమె పేరు దాయకండి.. ఒకవేళ మీరు ఆమెను ద్రౌపది అనదలచుకుంటే అనండి.. అంతే తప్ప ఒక మహిళ అని మాత్రం అనొద్దు' అన్నారు కమల్ హాసన్.
ఇక తాను హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో వివాదాల్లో చిక్కుకోవడం పై కూడా రియాక్ట్ అయ్యారు కమల్. 'ఎవరినీ కించపరిచే విధంగా ఈ రియాల్టీ ,షో లేదు' అన్నారాయన. అయితే.. ఈ షో పై కేసులు నమోదు కావడంతో.. కమల్ హాసన్ ఇంటి దగ్గర సెక్యూరిటీ పెంచారు పోలీసు అధికారులు.