Begin typing your search above and press return to search.
కమల్ సినిమా.. ఓన్లీ ఫర్ తమిళ ఆడియన్స్
By: Tupaki Desk | 25 Jun 2015 9:30 AM GMTచివరగా ఎప్పుడు ఇలా జరిగిందో మరి. గత రెండు దశాబ్దాల్లో అయితే కమల్ హాసన్ నటించిన ఏ సినిమా కూడా తెలుగులో విడుదల కాకుండా ఉన్నది లేదు. ఐతే ఇప్పుడు ఆయన సినిమా ఒకటి తమిళ ఆడియన్స్‌కే పరిమితం కాబోతోంది. ఆ సినిమాను మనం చూసే అవకాశం లేదు. ఆ సినిమా మరేదో కాదు.. పాపనాశం. మలయాళ బ్లాక్‌బస్టర్ 'దృశ్యం'కు రీమేకే ఈ పాపనాశం. ఈ సినిమాను ఇప్పటికే తెలుగులో విక్టరీ వెంకటేష్ చేసేశాడు. ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ కమల్ చేసిన అదే సినిమాను తెలుగులోకి తీసుకొస్తే మన ప్రేక్షకులకు ఎలాంటి ఆసక్తీ ఉండదు.
మన తెలుగు దృశ్యం తరహాలోనే పాపనాశం సినిమాను కూడా మలయాళ వెర్షన్‌ను డిట్టో దించేశారని విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది. అందుకే ఆ సినిమాను తెలుగులోకి తేవాలనుకోవట్లేదు. కమల్ గత ఏడాదే ఈ సినిమాను పూర్తి చేసినా.. ముందు 'ఉత్తమ విలన్' రిలీజవ్వాలనే ఉద్దేశంతో దీన్ని పక్కనబెట్టాడు. ఎట్టకేలకు జులై 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీ దృశ్యం జులై 17న విడుదలవుతున్న నేపథ్యంలో దాని కంటే ముందు రావాలన్న ఉద్దేశంతో కొంచెం హడావుడిగానే సినిమాను రిలీజ్ చేయిస్తున్నాడు కమల్. మలయాళ మాతృకకు దర్శకత్వం వహించిన జీతు జోసేఫే తమిళ వెర్షన్‌ను కూడా డైరెక్ట్ చేశాడు. కమల్ భార్యగా ఇందులో గౌతమి నటించడం విశేషం. దశాబ్దంన్నర తర్వాత వీళ్లిద్దరూ జంటగా నటించారు.