Begin typing your search above and press return to search.
యంగ్ హీరో రుణం ఇలా తీర్చుకుంటున్న కమల్ హాసన్
By: Tupaki Desk | 27 July 2022 5:30 AM GMTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా సక్సెస్ దక్కించుకుని చాలా సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్న సమయంలో 'విక్రమ్' తో బ్లాక్ బస్టర్ ను దక్కించుకున్నాడు. ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన కమల్ హాసన్ ఏ స్థాయి ఉత్సాహంతో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. బహుమానాలు.. ప్రశంసలు.. ముద్దులు ఇలా సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాడు.
విక్రమ్ సినిమాను తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆయన సొంత బ్యానర్ ద్వారా సినిమా ను విడుదల చేయడంతో ఎక్కువ థియేటర్లు లభించడం మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ప్రమోషన్స్ చేయడం జరిగింది.
దాంతో విక్రమ్ సినిమా భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేయడం జరిగింది అనేది తమిళ మీడియా వర్గాలు మరియు సినీ వర్గాల టాక్.
విక్రమ్ సక్సెస్ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ యొక్క రుణం తీర్చుకోవాలని కమల్ హాసన్ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ లో ఉదయనిధి స్టాలిన్ తో ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ఆ సినిమా కమల్ కు ఆర్థికంగా ఉపయోగదాయకం మరియు ఉదయనిధి కి కూడా ప్రయోజనకరం అంటున్నారు.
తాజాగా ఉదయనిధి స్టాలిన్ సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా ఆయన అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు భారీ కార్యక్రమం ను నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కమల్ హాసన్ పాల్గొన్నారు. ఆ సందర్బంగానే కమల్ హాసన్ యంగ్ హీరో తో సినిమా అంటూ అధికారికంగా ప్రకటించాడు.
వీరిద్దరి కాంబో సినిమా గురించి త్వరలో మరిన్ని విషయాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది. మొన్నటి వరకు ఉదయనిధి స్టాలిన్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవ్వబోతున్నారు.. ఆయన హీరోగా సినిమాలు చేయకపోవచ్చు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కాని తాజాగా ఆయన తో సినిమా చేయబోతున్నట్లుగా కమల్ ప్రకటించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.