Begin typing your search above and press return to search.
సినిమా ఏ ఒక్కరిదీ కాదు : కమల్
By: Tupaki Desk | 25 May 2015 7:30 PM GMTసినిమా అనేది అనేక కళల సమాహారం. ఇది ఏ ఒక్కరి సొంతమూ కాదు. లైట్ బాయ్ మొదలుకొని కళా దర్శకుడు, మేకప్ మేన్, డాన్సు మాస్టర్, ఎడిటర్, రచయితలు, దర్శకులు, నటీనటులు, నిర్మాత ఇలా 24 విభాగాల వారందరి కష్టానికి తుది రూపమే సినిమా. కాని కొన్ని సినిమాల్లో మాత్రం కేవలం కెమెరా బాగుందనో, ఆర్ట్ వర్క్ బాగుందనో, లేదా సంగీతం బాగుందనో ఆ సినిమాని ఏదో ఒక విభాగానికే పరిమితం చేస్తుంటారు. సినిమా కష్టం గురించి కమల్ కి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన డాన్సు అసిస్టెంట్ గా తన ప్రస్థానం ప్రారంభించి అనేక విభాగాల్లో చేస్తూ వస్తున్నారు.