Begin typing your search above and press return to search.

లోకనాయకుడితో మరోసారి రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిన చందమామ..?

By:  Tupaki Desk   |   18 July 2020 6:00 AM GMT
లోకనాయకుడితో మరోసారి రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిన చందమామ..?
X
సౌత్ సినీ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. సినీ కెరీర్ స్టార్ట్ చేసి 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. మూడు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో అదరగొడుతోంది కాజల్. 'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. 'మగధీర' 'చందమామ' 'ఆర్య 2' 'బృందావనం' 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రాల ద్వారా తెలుగు అభిమానులకు బాగా దగ్గరైపోయింది. అప్పటి నుండి కాజల్ కి వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు. ఓ వైపు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తూనే మరోవైపు సినీయర్ హీరోలతో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో లోకనాయకుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఇండియ‌న్ 2'లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం చందమామ కాజల్ లోకనాయకుడితో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం కొట్టేసిందట.

కాగా కమల్ హాసన్ ప్రస్తుతం 'ఇండియ‌న్ 2' కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత కమల్ హసన్ గౌత‌మ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా 2006 సంవత్సరంలో గౌత‌మ్ మీనన్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ 'వేట్టైయాడు విలైయాడు'కి సీక్వెల్ గా రాబోతోంది. జ్యోతిక, కమలినీ ముఖర్జీ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో 'రాఘవన్' పేరుతో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు 'వేట్టైయాడు విలైయాడు 2' (రాఘవన్ 2) మూవీలో హీరోయిన్ గా కాజ‌ల్ ని అనుకుంటున్నారట. ఇంతకముందు కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో నటించనుందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే క‌మ‌ల్ సైడ్ నుంచి ఈ ఇద్ద‌రు హీరోయిన్స్ ని తీసుకోవ‌డానికి గ్రీన్ సిగ్నెల్ వ‌చ్చేసింద‌ట‌. ప్ర‌స్తుతం గౌత‌మ్ మీనన్ 'రాఘవన్ 2' స్టోరీ మీద కంప్లీట్ ఫోక‌స్ పెట్టాడని సమాచారం.