Begin typing your search above and press return to search.
విశ్వనటుడి సంచలన ప్రకటన ఏమై ఉంటుంది?
By: Tupaki Desk | 8 Dec 2020 10:30 AM GMTవిశ్వనటుడు కమల్ హాసన్ బిగ్ బాస్ -తమిళ్ హోస్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రియాలిటీ షోని రంజుగా నడిపించడంలో కమల్ ని రీప్లేస్ చేసేవాళ్లే లేకపోవడంతో ఆయనే వరుసగా అన్ని సీజన్లను నడిపించేస్తున్నారు. ఇక ఈ మహమ్మారీ లాక్ డౌన్ లేటెస్ట్ సీజన్ కి పెద్ద ప్లస్ అయ్యింది. కమల్ హాసన్ కి చక్కని ఇమేజ్ పెంచే సందర్భంగా మారింది.
ఇక లాక్ డౌన్ అనంతరం అతడు పెండింగ్ లో ఉన్న భారతీయుడు 2 (ఇండియన్ 2) షూట్ పూర్తి చేస్తారని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే శంకర్ తో లైకా వాళ్ల గొడవలు ఎటూ తేలకపోవడం డైలమాను క్రియేట్ చేస్తోంది.
ఇదిలా ఉండగానే కమల్ హాసన్ నటిస్తున్న తదుపరి చిత్రం `విక్రమ్` పై కోలీవుడ్ కథనాలు సంచలనంగా మారి అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. విక్రమ్ మూవీ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్. కమల్ హాసన్ - రియల్ ఖైదీల కలయికతో `ఖైదీ`.. `మాస్టర్` చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమా తీస్తున్నానని ప్రకటించినప్పటి నుండి అభిమానులలో చాలా ఉత్సాహం నెలకొంది. కమల్ పుట్టినరోజున అద్భుతమైన టీజర్ విడుదలతో విక్రమ్ పై అంచనాలు తదుపరి స్థాయికి చేరుకున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. `విక్రమ్`కి సంబంధించిన మరో అప్ డేట్ త్వరలోనే అభిమానుల్లో మరింత వేడి పెంచనుందని సమాచారం. ఈ మూవీలో మాలీవుడ్ క్రేజీ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన విలన్ గా కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుందని తెలుస్తోంది. ఇద్దరు అసాధారణ నటులు ఒకరితో ఒకరు పోటీపడుతూ స్క్రీన్ స్పేస్ ని పంచుకోవడం వీక్షకులకు కనువిందు చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.