Begin typing your search above and press return to search.
ఆ రోజు కమల్ 'విశ్వరూపం' చూపిస్తాడట?
By: Tupaki Desk | 4 Nov 2017 4:26 PM GMTప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాద సమస్య నేపథ్యంలో కమల్ తెరకెక్కించిన విశ్వరూపం సినిమా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ఆ చిత్రం కమల్ కు సెన్సేషనల్ హిట్ ను అందించింది. విశ్వనటుడి కెరీర్లో ఆ సినిమా ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతో, ఆ సినిమాకు సీక్వెల్ ను ప్రారంభించాడు కమల్. అయితే, అనేక కారణాల వల్ల విశ్వరూపం-2 సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే, పట్టువదలని విక్రమార్కుడిలా కమల్ ఆ సినిమాను విడుదల చేయాలని కంకణం కట్టుకున్నాడు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు కమల్ రెడీ అయ్యాడని తెలుస్తోంది.
ఈ ఏడాది కమల్ పుట్టినరోజునాడు రెండు ప్రత్యేకతలున్నాయి. ఆ రోజు కమల్ తన రాజకీయ పార్టీ పై కీలకమైన ప్రకటన చేయబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజున, విశ్వరూపం-2 ట్రైలర్ ను విడుదల చేసేందుకు కమల్ ప్లాన్ చేస్తున్నారట. అదేగనక నిజమైతే ఆ రోజు కమల్ అభిమానులకు పండగే. బాలారిష్టాలను దాటుకున్న విశ్వరూపం-2 సినిమాను శభాష్ నాయుడు కంటే ముందే విడుదల చేయాలని కమల్ యోచిస్తున్నారట. త్వరలో రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయబోతున్న కమల్ ఆలోపే విశ్వరూపాన్ని చూపించాలనుకుంటున్నారట. విశ్వరూపం-1 వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన రాజకీయ అరంగేట్రానికి ముందే విశ్వరూపం-2 ను విడుదల చేయడం మంచిదని భావిస్తున్నారట. గతంలో కూడా ఒక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్న నేపథ్యంలో విశ్వరూపం ప్రదర్శనను పలుచోట్ల నిలిపివేసిన సంగతి తెలిసిందే.