Begin typing your search above and press return to search.
'మాస్టర్' పీస్ ను రిపీట్ చేస్తున్న కమల్ డైరెక్టర్
By: Tupaki Desk | 21 April 2021 10:30 AM GMTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తో ట్యాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'విక్రమ్'. విభిన్నమైన నేపథ్యంలో కమల్ హాసన్ ను చాలా విభిన్నంగా చూపిస్తున్న ఈ సినిమా లో మలయాళ స్టార్ నటుడు ఫహద్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్న దర్శకుడు లోకేష్ మరో స్టార్ నటుడిని ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విక్రమ్ సినిమా లో కమల్.. ఫహద్ లతో పాటు మరో నటుడు విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నారు. ఈ ముగ్గురు కూడా ముగ్గురే. ఇలాంటి కాంబినేషన్ ఒకటి వస్తుందని ఊహించలేదు అంటూ తమిళ సినీ అభిమానులు ఉవ్విల్లూరుతున్నారు.
లోకేష్ గత చిత్రం మాస్టర్ లో విజయ్ ను మించి విలన్ గా నటించిన విజయ్ సేతుపతికి మంచి పేరు వచ్చింది. సినిమా సక్సెస్ కు విజయ్ సేతుపతి కారణం అంటూ వార్తలు వచ్చాయి అంటే ఏ రేంజ్ లో ఆయన నటించాడో అర్థం చేసుకోవచ్చు. అంతటి అద్బుత నటన కనబర్చి మాస్టర్ పీస్ అనిపించుకున్న విజయ్ సేతుపతికి విక్రమ్ సినిమాలో మరో బెస్ట్ పాత్రను లోకేష్ కనగరాజ్ ఆఫర్ చేయడం జరిగిందట. ఆయన ఆఫర్ ను కాదనుకుండా విజయ్ సేతుపతి ఓకే చెప్పాడని కూడా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పునః ప్రారంభం అయ్యింది.
కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికలతో బిజీగా ఉండటం వల్ల రెండు నెలల పాటు వాయిదా వేశారు. ఇటీవల షూటింగ్ ను ప్రారంభించడంతో పాటు ఫహద్ మరియు విజయ్ సేతుపతిలు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ను ప్రముఖ నిర్మాణ సంస్థ తో కలిసి కమల్ స్వయంగా నిర్మిస్తున్నాడు.