Begin typing your search above and press return to search.

బాహుబ‌లిని ఆ దేశంలో దాచారు

By:  Tupaki Desk   |   21 April 2017 4:44 PM GMT
బాహుబ‌లిని ఆ దేశంలో దాచారు
X
టెక్నాల‌జీ రోజు రోజుకూ విస్తృత‌మ‌వుతున్న ఈ రోజుల్లో పెద్ద సినిమాల‌కు సంబంధించిన ముఖ్య‌మైన కంటెంట్ ను దాచి పెట్ట‌డం స‌వాలే అవుతోంది. ముఖ్యంగా ‘బాహుబ‌లి’ లాంటి మోస్ట్ అవైటెడ్ మూవీస్ కు సంబంధించి లీకులేమీ జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌డం చిన్న విష‌యం కాదు. రాజ‌మౌళి బృందం ఎన్ని జాగ్త‌ర్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ తొలి భాగం నుంచి ప‌ది నిమిషాల‌కు పైగా కంటెంట్ బ‌య‌టికి వెళ్లిపోవ‌డం తెలిసిందే. రెండో భాగానికి సంబంధించి కూడా కొంత రా కంటెంట్ లీకైంది. ఐతే అప్ప‌ట్నుంచి రాజ‌మౌళి బృందం చాలా అప్ర‌మ‌త్తంగా ఉంటోంది. ఆ త‌ర్వాత ఏ స‌మాచారం బ‌య‌ట‌కు పోకుండా క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లే చేసింది.

‘బాహ‌బులి: ది కంక్లూజ‌న్’ కోసం జ‌ర్మ‌నీలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేసింద‌ట చిత్ర బృందం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 36 స్టూడియోల్లో ఈ సినిమా వీఎఫెక్స్ ప‌నులు జ‌ర‌గ్గా.. అక్క‌డి నుంచి కంటెంట్ అంతా ఈ స‌ర్వ‌ర్ కే చేరుతుంద‌ట‌. బాహుబ‌లి టీం నుంచి అనుమ‌తి ఉన్న వీఎఫ్ ఎక్స్ నిపుణులు లాగిన్ అయితేనే ఈ కంటెంట్ ను చూడ‌గ‌ల‌రు. క‌రెక్ష‌న్ చేయ‌గ‌ల‌రు. ఎప్పుడు ఎవ‌రు లాగిన్ అయ్యారు.. ఏం చేశారు అన్న‌ది ఎప్ప‌టిక‌ప్పుడు బాహుబ‌లి వీఎఫ్ ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్ క‌మ‌ల్ క‌ణ్ణ‌న్ తో పాటు రాజ‌మౌళి త‌దిత‌రుల‌కు తెలిసిపోతుంది. ఈ ర‌కంగా బాహుబ‌లి కంటెంట్ బ‌య‌టికి పొక్క‌కుండా జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటూ వ‌చ్చింది చిత్ర బృందం. అందరికీ స్పష్టమైన ఆదేశాలుండటంతో ఎక్కడా పొరబాటు జరక్కుండా చూసుకున్నామ‌ని.. కాబట్టి లీకుల బెడద తప్పింద‌ని.. గత అనుభవాల దృష్ట్యా రాజమౌళి సహా అందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాడ‌ని క‌మ‌ల్ క‌ణ్ణ‌న్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/