Begin typing your search above and press return to search.

బాహుబ‌లి 2లో ఇంకా పెండింగ్ వ‌ర్క్ ఉందా?

By:  Tupaki Desk   |   21 April 2017 4:40 AM GMT
బాహుబ‌లి 2లో ఇంకా పెండింగ్ వ‌ర్క్ ఉందా?
X
మ‌హా అయితే మ‌రో ఆరు రోజులు. త‌ర్వాతి రోజునే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి తెర మీద సంద‌డి చేయ‌నుంది. జ‌క్క‌న్న చెక్కిన ఈ శిల్పం.. మొద‌టి పార్ట్ కంటే అత్య‌ద్భుతంగా వ‌చ్చిన‌ట్లు చెబుతున్నా.. అదెంత వ‌ర‌కూ నిజ‌మ‌న్న‌ది ప్రేక్ష‌కుడు తీర్పు ఇచ్చే రోజు ఇదే. ఇప్ప‌టివ‌ర‌కూ నిర్మాణ.. నిర్మాణ అనంత‌ర‌ ప‌నుల్లో బిజీగా ఉన్న బాహుబ‌లి టీం.. ఈ మ‌ధ్య‌నే ప్ర‌చారం మీద ఫోక‌స్ చేసింది. నిన్న‌టికి నిన్న క‌న్న‌డిగుల‌కు క‌న్న‌డ‌లో రాజ‌మౌళి చేసిన అప్పీలు చూస్తే.. బాహుబ‌లి 2 ప్ర‌చారంపై జ‌క్క‌న్న అండ్ టీం ఫోక‌స్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

ప్ర‌చారం మీద ఫోక‌స్ చేసిన వేళ‌.. సినిమాకు సంబంధించిన ప‌నులు పెండింగ్ ఉన్నాయా? అన్న ప్ర‌శ్న వేసుకుంటే.. ఎందుకు ఉంటాయ‌న్న మాట రావొచ్చు. కానీ.. సినిమాకు సంబంధించి గ్రాఫిక్ వ‌ర్క్ ఇంకా పూర్తి కాలేద‌న్న విష‌యం తెలిస్తే.. ఆశ్చ‌ర్యంతో పాటు.. టెన్ష‌న్ పుట్ట‌టం ఖాయం. రిలీజ్‌కు కేవ‌లం ఆరురోజుల ముందు కూడా వ‌ర్క్ పెండింగ్ ఉందన్న‌ది నిజ‌మేనా? అన్న సందేహం క‌ల‌గొచ్చు కానీ అది నిజ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. బాహుబ‌లి 2కు సంబంధించిన పెండింగ్ వ‌ర్క్ గురించి పెద‌వి విప్పారు విజువ‌ల్ ఎఫెక్ట్స్ సూప‌ర్ వైజ‌ర్ గా ప‌ని చేసిన క‌మ‌ల్ క‌ణ్ణ‌న్. తాజాగా ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. బాహుబ‌లి మూవీలో గ్రాఫిక్స్ కు ఉన్న‌ప్రాధాన్య‌త‌ను వివ‌రించారు.

2015 అక్టోబ‌రు 16న బాహుబ‌లి 2 టీమ్‌ లో చేరాన‌ని.. అప్ప‌టికే ప‌ని మొద‌లైంద‌ని.. మొత్తం 2555 షాట్స్ లో గ్రాఫిక్స్ అవ‌స‌ర‌మ‌ని గుర్తించిన‌ట్లుగా పేర్కొన్నారు. లాస్ ఏంజెల్స్ లోని జాన్ గ్రిఫిక్స్ అనే వ్య‌క్తి యుద్ద స‌న్నివేశాలు పూర్తి చేశాడ‌న్నారు. 18 నెల‌ల్లో 2200 షాట్స్ లో గ్రాఫిక్ పూర్తి చేయ‌ట‌మంటే జోక్ కాద‌ని.. బాహుబ‌లి 2 కోసం మ‌న దేశంలోనూ.. విదేశాల్లోని 50 స్టూడియోలు ఈ చిత్రం కోసం పూర్తి చేశాయ‌న్నారు.

ఏదైనా సీన్‌ కి గ్రాఫిక్స్ చేయ‌ట‌మంటే సాధ్యం కాద‌ని చెబితే రాజ‌మౌళి ఒప్పుకోర‌ని.. గూగుల్ లో వెతుకుతార‌ని.. నేరుగా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ తో మాట్లాడ‌తార‌ని.. ప‌ని విష‌యంలో రాజ‌మౌళిని సంతృప్తి ప‌ర్చ‌టం అంత తేలికైన విష‌యం కాదంటారు.

మొద‌టి భాగంతో పోలిస్తే రెండో భాగంలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఎక్కువ‌ని.. ఇందులో మ‌హిష్మ‌తి రాజ్యాన్ని పూర్తిగా చూడ‌టంతో పాటు.. దేవ‌సేన‌కు చెందిన కుంత‌ల రాజ్యాన్ని కూడా సెకండ్ పార్ట్ లో చూడొచ్చ‌ని.. రెండు రాజ్యాల‌కు మ‌ధ్య తేడా చూపించ‌టంలో ద‌ర్శ‌కుడితో పాటు.. త‌మ‌కు స‌వాలుగా మారింద‌ని చెబుతారు. ఏప్రిల్ 28న మూవీ రిలీజ్ డేట్‌ను నిర్మాత‌లు ప్ర‌క‌టించ‌టంతో.. గ్రాఫిక్స్ వ‌ర్క్ త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని న‌వంబ‌రు నుంచి తొంద‌ర‌ప‌డ్డార‌ని.. ఫిబ్ర‌వ‌రిలో తమ వ‌ర్క్ పూర్తి చేసి.. క‌రెక్ష‌న్స్ మీద ప‌డ్డామ‌న్నారు. ఇప్ప‌టికీ ఐదు క‌రెక్ష‌న్స్ ఇంకా చేయాల్సి ఉంద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/