Begin typing your search above and press return to search.

చిరుపై కమల్ ఒత్తిడి.. మెగాస్టార్ మారాల్సిందే!

By:  Tupaki Desk   |   10 Jun 2022 12:30 AM GMT
చిరుపై కమల్ ఒత్తిడి.. మెగాస్టార్ మారాల్సిందే!
X
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఒకప్పుడు మొదటి రోజు మొదటి షో చూడాలి అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం చొక్కాలు చించుకున్నా సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని ప్రస్తుత జనరేషన్ లో ఉన్న చాలా మంది దర్శకులు కూడా అదే మాట చెబుతూ వచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మెగాస్టార్ సినిమాకు గతంలో మాదిరిగా రెస్పాన్స్ అయితే అందడం లేదు అని ఆచార్య సినిమాతో చాలా క్లారిటీ గా అర్థమైంది. రాజకీయాల నుంచి దూరంగా జరిగిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత ఖైదీ నెంబర్ 150 సినిమా తో సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా కమర్షియల్గా పర్వాలేదనిపించింది. ఇక ఆ తర్వాత ఎంతో గ్యాప్ తీసుకొని సైరా అనే ఒక ప్రయోగాత్మకమైన చారిత్రాత్మక చిత్రాన్ని చేశారు. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక రీసెంట్ గా ఆచార్య సినిమా కోసం కమర్షియల్ గా అన్ని అంశాలపై జాగ్రత్తలు తీసుకొని ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని అనుకున్న మెగాస్టార్ కు ఊహించని దెబ్బ పడింది. పైగా ఎప్పటి నుంచో తన కొడుకు తో నటించాలని కోరికతో ఆ సినిమాలోకి రామ్ చరణ్ రప్పించారు.

ఎలా చూసుకున్నా కూడా ఆచార్య సినిమా కమర్షియల్ పాయింట్స్ లో ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద దాదాపు 70 కోట్ల నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. అంటే మెగాస్టార్ కెరీర్ మొత్తంలో ఇది అతి పెద్ద డిజాస్టర్. అయితే మెగాస్టార్ చిరంజీవి రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ ను పక్కన పెట్టేసి ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తే చాలా బాగుంటుంది అనే సలహాలు కూడా చాలానే వస్తున్నాయి.

ముఖ్యంగా ఇటీవల కమల్ హాసన్ చేసిన విక్రమ్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమర్షియల్ అంశాలను పూర్తిగా దూరం పెట్టి ఆడియన్స్ సినిమా చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎన్నిసార్లు ప్లాప్ ఈమా కూడా కమల్ ఆ ఫార్మాట్ ను అయితే మరువలేదు. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనంతరం లైన్లో పెట్టిన సినిమాలు కూడా రొటీన్ సినిమాలే. గాడ్ ఫాదర్ రీమేక్ అయినప్పటికీ కూడా అందులో కొత్తగా ఏం చూపిస్తారో అనేది పెద్ద ప్రశ్న.

అలాగే బోళా శంకర్ వాల్తేరు వీరయ్య సినిమాలు పక్కకు మాస్ కమర్షియల్ సినిమాల గానే తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా బోళా శంకర్ దర్శకుడు మెహర్ రమేష్ కమర్షియల్ గా సినిమాలు చేసి డిజాస్టర్ అందుకోవడంలో ఎంతో అనుభవం ఉంది. మరో డైరెక్టర్ బాబీ కూడా అంతగా ప్రయోగాలు ఏమీ చేయడు. కాబట్టి ఫ్యాన్స్ ఆ సినిమాలపై పెద్దగా ఆశలు ఏమి పెట్టుకోలేదు.

ఇక మెగాస్టార్ ఈ సినిమాలను జాగ్రత్తగా చేస్తున్నప్పటికీ అవి పెద్ద ప్రమాదమే. ఇక కమల్ హాసన్ విక్రమ్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తరహాలో సినిమాలు చేస్తే బాగుంటుంది అని అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మరి మెగాస్టార్ ఈ విషయంపై ఆలోచించి కొత్త తరహా ప్రాజెక్టులను లైన్ లోకి తీసుకు వస్తారో లేదో చూడాలి.