Begin typing your search above and press return to search.

రివ్యూలకు ఆయన గుడ్ బై.. ఊపిరి పీల్చుకోనున్న బాలీవుడ్‌

By:  Tupaki Desk   |   30 Dec 2022 5:32 AM GMT
రివ్యూలకు ఆయన గుడ్ బై.. ఊపిరి పీల్చుకోనున్న బాలీవుడ్‌
X
కే.ఆర్‌.కే అలియాస్ కమల్‌ ఆర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్‌ మీడియా ఫాలో అయ్యే సౌత్‌ ఇండియన్ సినీ ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితుడు. హిందీ సినిమాలకు రివ్యూలు ఇచ్చే ఈయన సల్మాన్‌ ఖాన్‌ ను మొదలుకుని ప్రతి ఒక్కరి సినిమాలను చీల్చి చెండాడుతూ ఉంటాడు. జెన్యూన్ రివ్యూ ఇస్తానంటూ ఈయన ఇచ్చే రివ్యూలు ప్రతి సారి వివాదాస్పదం అవుతాయి.

కమల్‌ ఆర్ ఖాన్ యొక్క రివ్యూల్లో 99 శాతం రివ్యూలు వివాదాలను రేపాయి. స్టార్‌ హీరోల సినిమాలను ఓ రేంజ్ లో ఏకి పారేస్తూ రివ్యూలు ఇచ్చే చాలా సినిమాలకు నష్టం కలిగించాడు అంటూ బాలీవుడ్ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈయన రివ్యూలు నమ్మినా నమ్మకున్నా చాలా మంది ఈయన రివ్యూలను చూసి సినిమాలను లైట్ తీసుకున్న సందర్భాలు ఉంటాయట.

అందుకే కమల్‌ ఆర్ ఖాన్ చాలా మంది బేరసారాలు సాగించారు అనేది టాక్. సల్మాన్ ఖాన్ మరియు ఈయనకు మధ్య ప్రస్తుతం చట్టపరమైన వాదనలు నడుస్తున్నాయి. పరువునష్టం దావా వేసిన సల్మాన్‌ ఖాన్‌ ను అదే స్థాయిలో కే ఆర్ కే ఢీ కొడుతున్నాడు.

తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ తో పాటు స్టార్స్‌ ఇంకా దర్శకులు ఊపిరి పీల్చుకునే విధంగా ఉంది. ఆయన ట్విట్టర్ లో.. ప్రియమైన మిత్రులారా నేను 100% నిజం చెబుతున్నాను... పఠాన్ సినిమా తర్వాత మరే సినిమాకు కూడా రివ్యూ చెప్పను. ఇన్నాళ్లు నన్ను సపోర్ట్‌ చేసిన వారందరికి కూడా కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశాడు.

కే ఆర్ కే యొక్క ట్వీట్‌ ను ఎంత వరకు నమ్మవచ్చు అంటూ బాలీవుడ్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఆయన మాట మీద నిలబడుతాడు అని తాము భావించడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌ బాస్ తో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈయన నటుడిగా చాలా సినిమాల్లో నటించాడు.

ఏ ఒక్కటి ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు మరియు రివ్యూల కారణంగానే కే ఆర్ కే కు మంచి ఆధరణ లభించింది.. ఆదాయం లభించిందట. కనుక ఆయన ఈ రివ్యూలను వదులుకుంటాడా అంటే అనుమానమే అన్నట్లుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.