Begin typing your search above and press return to search.
సుశాంత్ తరహాలోనే నన్ను కూడా టార్గెట్ చేశారు
By: Tupaki Desk | 3 Oct 2022 8:50 AM GMTబాలీవుడ్ ఇండస్ట్రీపై నిరంతరం ఏదో ఒక విధంగా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే కమల్ ఆర్ ఖాన్ ఈసారి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారాయి. తనకు తానే సినిమా అనలిస్టుగా విశ్లేషకుడిగా సినీ విమర్శకుడిగా చెప్పుకునే కె.ఆర్.కె గతంలో చాలాసార్లు బాలీవుడ్ సినిమాలపై నెగిటివ్ గా రివ్యూలు ఇచ్చాడు. అంతే కాకుండా అతని సోషల్ మీడియా పేజీలకు అలాగే యూట్యూబ్ ఛానల్ కు కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా పెరిగారు.
అనంతరం మరింత రెచ్చిపోయి సినిమా తారలపై కూడా తరచుగా ఏదో ఒక విధంగా కాంట్రవర్సీ క్రియేట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. అయితే మరణించిన సినీ నటులపై కూడా KRK చేసిన వ్యాఖ్యలు ఊహించిన విధంగా కాంట్రవర్సీకి దారితీసాయి. నటులు రిషి కపూర్ ఇర్ఫాన్ ఖాన్ మరణించినప్పుడు కూడా KRK వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసాయి.
ఇక అతను ఎక్కువగా దుబాయిలో ఉంటూ ఈ తరహాలో కామెంట్ చేయడం తో నిలదీయడానికి అవకాశం దొరకలేదు. అయితే ఇటీవల ఇండియాకు మళ్ళీ తిరిగి రావడంతో అతనిపై ఉన్న పోలీస్ కంప్లైంట్స్ మళ్ళీ వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు ఎయిర్ పోర్ట్ లోనే అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇక 10 రోజుల పాటు జైలులో ఉన్న అతను సోషల్ మీడియాలో మళ్లీ ఎమోషనల్ గా స్పందించాడు.
బెయిల్ మీద బయటకు వచ్చిన KRK 20 రోజులపాటు జైల్లో ఉండటం వలన జ్ఞాపకశక్తి కూడా దాదాపు 20% తగ్గిపోయింది అని ప్రస్తుతం చాలా విషయాలు తనకు గుర్తు ఉండడం లేదు అని తెలియజేశాడు. అయితే ఇది కేవలం బాలీవుడ్ జనాల కుట్ర అని నన్ను కూడా సుశాంత్ తరహాలోనే తొక్కేసాలా ఉన్నారు అని అన్నాడు.
ఇక భవిష్యత్తులో కూడా తన జ్ఞాపకశక్తిని మరింత కోల్పోవచ్చు అని వైద్యులు చెప్పారని అంటూ ఒకవేళ అది తీవ్రతరంగా మారి నేను మరణిస్తే మాత్రం అందుకు బాధ్యులు బాలీవుడ్ జనాలే అని కమల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.