Begin typing your search above and press return to search.
చెన్నైకి కమల్ మళ్లీ ఆ గౌరవం తీసుకొస్తారట!
By: Tupaki Desk | 14 Dec 2022 2:30 AM GMTఒకప్పుడు దక్షిణ భారత సినిమాకు మద్రాస్ నేటి చెన్నై నగరం కేరాఫ్ అడ్రస్ గా వుండేది. మద్రాస్ కేంద్రంగానే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల నిర్మాణం జరిగేది. దీంతో ఈ నాలుగు భాషలకు చెందిన స్టార్స్, నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు అంతా చెన్నై మహానగరంలోనే వుండేవారు. కానీ రోజులు మారాయి. తెలుగు సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయింది. దాంతో స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు అన్నికూడా ఇక్కడ వెలిశాయి.
కొంత మంది సీనియర్ దర్శకులు, స్టార్స్, ప్రొడ్యూసర్స్ ఇప్పటికీ చెన్నైలోనే వుంటున్నా తెలుగు సినిమా మాత్రం మొత్తంగా హైదరాబాద్ కు మారిపోయింది. ఇప్పడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టిస్తుండటంతో టాలీవుడ్ సినీ హబ్ గా మారిపోతోంది.
ప్రముఖంగా ఇండియన్ సినిమాలో వినిపించడం మొదలు పెట్టి దక్షిణాది సినిమా అంటే చెన్నై అనే టాక్ ని వెనక్కి నెట్టేసింది. అయితే ఈ విషయంలో కమల్ హాసన్ అసంతృప్తితో వున్నారట.
మళ్లీ చెన్నైకి ఆ గౌరవాన్ని తీసుకొస్తానంటున్నారు. ఇటీవల ది ఫిల్మ్ మేకర్స్ అడ్డాని ఓ యూట్యూబ్ ప్రత్యేకంగా ఛానల్ హోస్ట్ చేసింది. ఇందులో కమల్ హాసన్, రాజమౌళి, స్వప్నదత్, పృథ్వీరాజ్ కుమార్ సుకుమారన్, లోకేష్ కనగరాజ్ తది తరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కమల్ హాసన్ చెన్నైని దక్షిణ భారత సినిమా హబ్ గా ఎలా పరిగణిస్తారో ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే దక్షిణ భారత సినిమాకు కేంద్రంగా నిలిచిన చెన్నైని హైదరాబాద్ అధిగమించి ఆ పేరుని దూరం చేసిందన్నారు.
అయితే చెన్నైకి మళ్లీ ఆ గౌరవం తీసుకొస్తానని, గతంలో అక్కడ అన్ని భాషలకు చెందిన సినిమాల షూటింగ్ లు జరిగే వని.. అది మళ్లీ జరిగేలా చేస్తానన్నారు. గతంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా చెన్నైలో షూటింగ్ లు చేసేవారు. ఏవీఎం స్టూడియోస్ , వీజీపీ గార్డెన్స్ వంటి పలు ప్రదేశాల్లో షూటింగ్ లు చేసేవారు. కానీ ఇప్పడు హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ అందుబాటులో వుండటంతో చాలా వరకు బాలీవుడ్ సినిమాలు అక్కడే షూటింగ్ లు జరుపుకుంటున్నాయని, ఇకపై షూటింగ్ ల కోసం చెన్నైకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తానని కమల్ తెలపడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.