Begin typing your search above and press return to search.

లేడి ప్రొడ్యూసర్ కామ‌సూత్ర‌... త్వరలో..

By:  Tupaki Desk   |   9 April 2018 1:47 PM GMT
లేడి ప్రొడ్యూసర్ కామ‌సూత్ర‌... త్వరలో..
X
ఆడ‌వాళ్లలో కూడా వీర‌ శృంగార ప్రియులు ఉంటారు అన‌డానికి ఏకైక బిగ్గెస్ట్ ఉదాహ‌రణ ఏక్తా క‌పూర్‌. పాప నిర్మించిన సినిమాల్లో ఉండే బూతు చూసి- బ్లూ ఫిల్మ్స్ తీసేవాళ్లు కూడా తెగ ఆశ్చ‌ర్య‌పోతుంటారు. ఆ రేంజ్ లో శృంగారం నిండి ఉండే సినిమాల‌కే ఓటేస్తుంది ఏక్తా క‌పూర్‌. అంత‌గా పేరు తెచ్చుకున్న ఈ లేడీ ప్రొడ్యూస‌ర్‌... త్వ‌ర‌లో ర‌సిక హృద‌యాల‌ను కొల్ల‌గొట్టేందుకు రెఢీ అవుతోంద‌ట‌.

హాట్ హాట్ భంగిమ‌ల ఫోటోల‌తో వాల్ పోస్ట‌ర్ల నుంచి వేడి పుట్టించ‌డం ఏక్తాకి బాగా తెలిసిన విద్య‌. పోస్ట‌ర్ల‌ను చూసి- ఏదో ఊహించుకొని వ‌చ్చిన వాళ్ల‌కి సినిమాల్లోనూ బోలెడంత కామ ర‌సం ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటుంది ఏక్తా. అందుకే ఈ సారి త‌న‌లాంటి శృంగార ప్రియుల కోసం ఓ వెబ్ సిరీస్ తీయాల‌ని అనుకుంటోంది ఏక్తా. శృంగార ర‌సాన్ని వివ‌రించే హిందూ సంప్ర‌దాయ కామ సూత్రాల‌తో పాటు రాజ‌స్థాన్ లోని ఓ కుల ఆచారాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొంద‌నుంద‌ని సమాచారం. ఇప్ప‌టికే స్ర్కిప్టు మొత్తం సిద్ధ‌మ‌య్యింద‌ని... మాంచి క‌ళాపోష‌ణ తెలిసిన ద‌ర్శ‌కుడు దొరికితే షూటింగ్ మొద‌లెట్ట‌డ‌మే త‌రువాయి అని టాక్‌.

ఎక్క‌డా శృంగారం మిస్ కాకుండా... యూత్‌కు సెక్స్ ఎడ్యూకేష‌న్ పాఠాలు కూడా నేర్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది ఈ యంగ్ ప్రొడ్యూస‌ర్‌. సినిమాగా తీసేందుకు సెన్సార్ అడ్డుప‌డుతుంది కాబ‌ట్టే వ‌ర్మ రూటులో ఈ వెబ్ సిరీస్ ను ఎంచుకుంద‌ట‌. వ‌ర్మ వెబ్ సిరీస్ ట్రైల‌ర్లు బూతుతో... న‌గ్న‌త్వంతో నిండి ఉండ‌డం చూసి వాటికి చాలా క్రేజ్ వ‌చ్చింది. అయితే అవి అక్క‌డే ఆగిపోయాయి. అదే రూటును ఏక్తా ఎంచుకుంది. ఏక్తా లాంటి నిర్మాత త‌లుచుకుంది కాబ‌ట్టి ప్రాశ్చాత్య‌దేశాల్లాగే ఇక్క‌డా వెబ్ తెర మీద శృంగార చిత్రాలు ఇక అఫిషియ‌ల్ అవ్వ‌డం ప‌క్కా! అని అనుకుంటున్నారు నెటిజ‌నులు.