Begin typing your search above and press return to search.

#KRKR: రివైజింగ్ క‌మిటీ ముందుకు ఆర్జీవీ

By:  Tupaki Desk   |   30 Nov 2019 1:26 PM GMT
#KRKR: రివైజింగ్ క‌మిటీ ముందుకు ఆర్జీవీ
X
`క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` చివ‌రి నిమిషం టెన్ష‌న్స్ గురించి తెలిసిందే. న‌వంబ‌ర్ 29న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఊహించ‌ని ట్విస్టుల‌తో వాయిదా ప‌డింది. సెన్సార్ పూర్తి చేసేందుకు సీబీఎఫ్ సీ బృందం నిరాక‌రించ‌డంతో .. కోర్టు జోక్యం చేసుకుని వెంట‌నే ఈ సినిమాకి సెన్సార్ ఫార్మాల్టీస్ పూర్తి చేయాల్సిందిగా కోరింది. అలాగే కోర్టు ఆదేశానుసారం ఈ సినిమా టైటిల్ ని మార్చ‌నున్నారు. అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే టైటిల్ తో రిలీజ్ చేయ‌నున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు చిత్రాన్ని నేడు వీక్షించిన సెన్సార్ స‌భ్యులు ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశార‌ట‌. కుల రాజ‌కీయాల నేప‌థ్యంలో అభ్యంత‌రక‌ర స‌న్నివేశాలున్నాయ‌ని.. అలైవ్ గా ఉన్న రాజ‌కీయ నాయ‌కుల్ని టార్గెట్ చేస్తూ తీయ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మవుతాయ‌ని సెన్సార్ బృందం అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డ‌మే గాక‌.. కొన్ని స‌న్నివేశాల్ని తొల‌గించాల‌ని ఆర్జీవీకి సూచించింద‌ట‌.

అయితే సీబీఎఫ్‌ సీ బృందం సూచ‌న‌ల్ని ఆర్జీవీ తీవ్రంగా వ్య‌తిరేకించ‌డ‌మే గాక‌.. రివైజింగ్ క‌మిటీకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ లో చంద్ర‌బాబు నాయుడుని విల‌న్ గా చూపించ‌డ‌మే గాక‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్- కేఏ పాల్ - లోకేష్ వంటి నాయ‌కుల్ని జోక‌ర్స్ గా ఆవిష్క‌రించిన సంగ‌తి టీజర్.. ట్రైల‌ర్ల‌తో రివీలైంది. ర‌క‌ర‌కాల రాజ‌కీయ కార‌ణాల‌తోనూ ఇందులో స‌న్నివేశాల్ని క‌ట్ చేయాల్సి ఉంటుంద‌ని సీబీఎఫ్ సీ కోర‌డంతో దానిని ఆర్జీవీ వ్య‌తిరేకిస్తున్నారు. ఇక ఏ ఒక్క కులాన్ని తాను కించ‌ప‌ర‌చ‌డం లేద‌ని ఆయ‌న ఇదివ‌ర‌కూ మీడియా ముఖంగా వెల్ల‌డించారు. ఎవ‌రో ఒక ముగ్గురు సెన్సార్ వాళ్లు చూసి నిర్ణ‌యించ‌డం క‌రెక్ట్ కాద‌ని అభిప్రాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.