Begin typing your search above and press return to search.
కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్ మారిపోయింది
By: Tupaki Desk | 28 Nov 2019 3:56 AM GMTవివాదాల వీరుడు రామ్ గోపాల్ వర్మ ఒత్తిడికి తలొగ్గాడు. తన కొత్త సినిమా కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్ మార్చడానికి నిర్ణయించుకున్నాడు. ఈ టైటిల్‌ను అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చినట్లు తాజా సమాచారం. కులాల ప్రస్తావనతో అత్యంత వివాదాస్పదంగా టైటిల్ పెట్టి తన సినిమాకు బాగానే పబ్లిసిటీ చేసుకున్నాడు వర్మ. ఐతే ఈ సినిమా విడుదల ముంగిట చిక్కులు తప్పలేదు. కేఏ పాల్‌తో పాటు ఇంకో ఇద్దరు ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టుకెక్కారు. అవేమీ పట్టించుకోకుండా వర్మ తన సినిమాను సెన్సార్ సర్టిఫికేషన్ కోసం పంపాడు. ఐతే ఈ టైటిల్ పట్ల సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. పేరు మార్చాల్సిందే అని తేల్చి చెప్పింది.
దీంతో కులాల ప్రస్తావన తీసేస్తూ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని టైటిల్ మార్చాడు వర్మ. తన సినిమా టైటిల్ విషయంలో అభ్యంతరాలు తప్పవని వర్మ ఇంతకుముందే అంగీకరించాడు. మరీ గొడవ జరిగితే అక్షరాలు కాస్త అటు ఇటు మార్చి రిలీజ్ చేస్తానంటూ ఓ ఇంటర్వ్యూలో సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అంచనా వేసినట్లే టైటిల్ మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టైటిల్ మార్చక తప్పలేదు. దీంతో వర్మ ముందే ఆలోచించి పెట్టుకున్న రెడీ మేడ్ టైటిల్ పెట్టేసినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సెన్సార్, ఇతర సమస్యల కారణంగా వాయిదా తప్పేలా లేదు. రెండు నెలల కిందట వాల్మీకి టైటిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమైతే.. చిత్ర బృందం తమకు తాముగా గద్దలకొండ గణేష్ టైటిల్‌తో సినిమా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.