Begin typing your search above and press return to search.
ముగ్గురు ముద్దుగుమ్మలతో కమ్ముల హీరో
By: Tupaki Desk | 12 July 2021 5:17 AM GMTశేఖర్ కమ్ముల తదుపరి సినిమాను ధనుష్ తో చేయబోతున్నాడు. ఈ ఏడాది చివరి నుండి ప్రారంభం కాబోతున్న ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే స్టోరీ సిద్దం అయ్యిందని ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు భేటీ అయిన సందర్బంగా తెలియజేశారు. ధనుష్ ప్రస్తుతం చేస్తున్న 43వ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్బంగా ధనుష్ తదుపరి చిత్రాల విషయమై చర్చలు జరుగుతున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా కంటే ముందు మిత్రన్ జవహర్ సినిమాలో ఈయన నటించబోతున్నాడు.
మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ధనుష్ చేయబోతున్న సినిమా 44వదిగా రూపొందబోతున్న విషయం తెల్సిందే. జవహర్ సినిమాలో ధనుష్ కు జోడీగా ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నారట. కథానుసారంగా ఇప్పటికే ముగ్గురు హీరోయిన్స్ విషయంలో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున అంచనాలు ఉన్న ఈ సినిమాను అతి త్వరలోనే పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ధనుష్ హీరోగా గతంలో మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వీరి కాంబోలో రాబోతున్న తదుపరి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా మిత్రన్ గతంలో మాదిరిగా ధనుష్ ఈ సినిమాను ప్లాన్ చేశాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేయబోతున్నారు. ధనుష్ ఈమద్య కాలంలో తెలుగు లో ధనుష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కనుక ఆయన నటిస్తున్న అన్ని సినిమాలు కూడా తెలుగులో వరుసగా విడుదల అయ్యే అవకాశం ఉంది. కనుక మిత్రన్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కూడా కాస్త కథను చూపిస్తే టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.