Begin typing your search above and press return to search.
శేఖర్ కమ్ముల రిస్క్ చేయబోతున్నాడా...?
By: Tupaki Desk | 2 May 2020 5:30 PM GMT'డాలర్ డ్రీమ్స్' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీస్ సున్నితంగా చూపించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల దిట్ట అనే చెప్పాలి. ఇప్పటివరకూ శేఖర్ కమ్ముల ఎక్కువగా ఫ్రెండ్ షిప్ - లవ్ - కుటుంబ నేపథ్య కథలతో సినిమాలు తీశారు. శేఖర్ కమ్ముల అనగానే వెంటనే మంచి ఫీల్ గుడ్ చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆనంద్’ ‘గోదావరి’ ‘హ్యాపీడేస్’ ‘ఫిదా’ చిత్రాలు ఎంతటి ఘన విజయాలను సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతవరకు శేఖర్ కమ్ముల మేకింగ్ లో పెద్దగా ప్రయోగాలు చేసింది లేదు. ఆయన చేసిన సెన్సిబుల్ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. గతంలో తన పంథా మార్చి నయనతారతో ‘అనామిక’ అనే థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ ‘కహానీ’కి రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రం మిశ్రమ ఫలితాల్ని అందుకుంది. మళ్లీ ఇప్పుడు మళ్ళీ రొటీన్ కు భిన్నంగా ఈసారి థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నారట.
లాక్ డౌన్ సమయాన్ని కమ్ముల శేఖర్ ఈ థ్రిల్లర్ స్క్రిప్ట్ రాసుకోడానికి ఉపయోగించుకుంటున్నాడట. ప్రస్తుతం తీస్తున్న 'లవ్ స్టోరీ' విడుదలైన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడట శేఖర్ కమ్ముల. కానీ విషయం తెలిసి శేఖర్ కమ్ముల రిస్క్ చేస్తున్నాడేమో అని ఫిలింనగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈసారి శేఖర్ కమ్ముల ఎలాంటి థ్రిల్లర్ కథ తో సినిమా చేస్తారో.. ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. ఇదిలా ఉండగా అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్ - ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'ఫిదా' లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా లాక్ డౌన్ వల్ల నిలిచిపోయింది.