Begin typing your search above and press return to search.

ఆమెకు ఐదో నెల.. అయినా ప్రమోట్ చేస్తోంది

By:  Tupaki Desk   |   23 Sep 2015 10:03 AM GMT
ఆమెకు ఐదో నెల.. అయినా ప్రమోట్ చేస్తోంది
X
కోట్లు పుచ్చుకునే హీరోయిన్లు కూడా సినిమాను ప్రమోట్ చేయడానికి బెట్టు చేస్తుంటారు. ప్రమోషన్ గురంచి అగ్రిమెంట్ లో రాయలేదు కదా.. అని లాజిక్కులు తీస్తుంటారు. కానీ ఓ చిన్న హీరోయిన్.. ఐదు నెలల ప్రెగ్నెన్సీతో ఉండి కూడా తన సినిమాను ప్రమోట్ చేయడానికి రావడం విశేషమే. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. కామ్న జెఠ్మలానీ.

రణం - బెడు అప్పారావు - కత్తి కాంతారావు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కామ్నకు అవకాశాలు బాగా తగ్గిపోయాక బెంగళూరుకు చెందిన సూరజ్ నాగ్ పాల్ అనే బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే పెళ్లయ్యాక కూడా ఆమె నటనకు దూరం కాలేదు. ‘చంద్రిక’ అనే హార్రర్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చింది కామ్న. ఐతే ఆమెను చూస్తే విలేకరులకు ప్రెగ్నెంట్ ఏమో అన్న డౌటొచ్చింది. ఆ సంగతే ఆమెనడిగితే.. అవునని, తనకిప్పుడు ఐదో నెల అని చెప్పింది. త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు వెల్లడించింది. మామూలుగా ఈ సమయంలో అమ్మాయిలు ఇంటిపట్టునే ఉంటారు. కానీ కామ్న మాత్రం సినిమా కోసం బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేయడం విశేషమే. ఆమెను చూసైనా కొందరు స్టార్ హీరోయిన్లు బుద్ధి తెచ్చుకుంటారేమో చూడాలి.