Begin typing your search above and press return to search.
ఇద్దరు పిల్లల మమ్మీ ఐటెమ్ పాటల రెడీ
By: Tupaki Desk | 7 July 2021 11:30 PM GMTకామ్నా జఠ్మలనీ పెళ్లి వ్యవహారం అప్పట్లో ఇంటా బయటా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రహస్యంగా ఓ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకోవడమే ఈ ప్రచారానికి కారణమైంది. నటీమణుల సడెన్ సీక్రెట్ పెళ్లిళ్లు చాలానే ఉంటాయి. కాకపోతే కామ్న జఠ్మలనీ పెళ్లి తంతు కాస్త భిన్నం. పెళ్లి అయిన విషయం పరిశ్రమలో తెలిస్తే సినిమా అవకాశాలు తగ్గిపోతాయనే భయంతోనే కామ్నా ఇలా చేసిందని మరోసారి తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు కూడా వచ్చాయి. దీంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కామ్నా కూడా ఇప్పుడు స్పందించక తప్పలేదు.
పెళ్లికి.. సినిమా అవకాశాలకు సంబంధం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. పెళ్లి చేసుకున్నా సినిమాల్లో నటిస్తానన్న ఒప్పందంతోనే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. తను సినిమాల్లో నటించడం తన భర్తకు ఇష్టమేనని అన్నారు. అలాగే తన పెళ్లి రహస్యంగా జరగలేదని.. పరిశ్రమలో చాలా మందికి ఈ విషయం తెలుసునని తెలిపారు. అయితే ఎవర్నీ పెళ్లికి మాత్రం పిలవలేదని..కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగిందని వివరణ ఇచ్చారు.
తనది ప్రేమ పెళ్లి కాదని..పెద్దలు కుదర్చిన సంబంధం అని తెలిపారు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సినిమా అవకాశాలు కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కొత్త ఇన్నింగ్స్ లో సపోర్టింగ్ రోల్స్ కన్నా.. మంచి మసాలా పాటల్లో నటించాలని ఉందన్న కోరికను బయట పెట్టారు. ఇద్దరు పిల్లలకు తల్లైనా..తనలో బ్యూటీ మాత్రం చెరిగిపోలేదని అన్నారు. కామ్నా జఠ్మలానీ సినిమాల్లో నటించి అయిదేళ్లు అవుతుంది. ఆమె చివరిగా చంద్రిక అనే సినిమాలో నటించారు. తర్వాత 5 ఏళ్లు గ్యాప్. ప్రస్తుతం గరుడ అనే ఓ కన్నడ సినిమాలో నటిస్తున్నారు. తదుపరి టాలీవుడ్ లోనూ ఐటెమ్ నంబర్లతో అదరగొట్టాలన్న కసితో కామ్న ఉన్నారు. మరి తనకు అవకాశం ఇచ్చే దర్శకహీరోలు ఎవరో ..!