Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: లేడీ ధోనీ లా ఐశ్వర్య!
By: Tupaki Desk | 26 Nov 2018 4:14 PM GMTస్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాల్లో ఒక డీప్ ఎమోషన్ ఉంటుంది. ఎందుకంటే మనదేశంలో ఆటలను ఎంకరేజ్ చేసేవారి కంటే ఎక్కువగా డిస్కరేజ్ చేసేవారే ఉంటారు కాబట్టి. ఇక కుటుంబ ఆర్థిక సమస్యలు.. ఉద్యోగాలు చేయకపోతే ఇల్లు గడవదు అనే అభిప్రాయం కూడా మన సమాజంలో ఎక్కువే. డబ్బు ఉండేవారి పరిస్థితి కొంచెం వేరేగా ఉంటుంది గానీ జనరల్ గా 80% మంది పరిస్థితి ఇలానే ఉంటుంది. కపిల్ దేవ్ నుండి.. ధోని వరకూ ఇలాంటి స్టొరీలే.
ఇక 'కానా' పేరుతో క్రికెట్ నేపథ్యంలో తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక మారుమూల పల్లెటూరిలో ఉండే పేదింటి అమ్మాయి. ఆ అమ్మాయి తన తండ్రి సత్యరాజ్ వల్ల క్రికెట్ అంటే అపరిమితమైన ప్రేమ ఏర్పడుతుంది. అసలే పల్లెటూరు.. అంతంత మాత్రం ఆర్ధిక స్తోమత కల కుటుంబం.. పైగా ఆడపిల్ల. ఇలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఎలా తన క్రికెట్ కలను నెరవేర్చుకుంది.. ఎలా ఇంటర్నేషనల్ క్రికెటర్ గా విజయం సాధించింది అన్నది ఈ స్టొరీ.
'కాకా ముట్టై' చిత్రంతో తన నటనకు ఎన్నో ప్రశంసలందుకున్న ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. తమిళ హీరో శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. అరుణ్ రాజా కామరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ ఒక అతిథిపాత్రలో నటించడం విశేషం. కథ.. న్యాచురాలిటీ ప్రతిబింబించే విజువల్స్.. ఓవరాల్ గా ఇది ప్రేక్షకుల మనసులను తడిమే చిత్రం అని మాత్రం చెప్పొచ్చు. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇక ఆలస్యం ఎందుకు... ట్రైలర్ పై ఒక లుక్కేయండి.