Begin typing your search above and press return to search.
జోకేసినందుకు మోడల్ కు జైలు శిక్షే
By: Tupaki Desk | 6 March 2017 11:06 AM GMTఇష్టమొచ్చినట్లే జోకులేస్తే తీసుకోవడానికి ఇదేమన్నా సినిమా ఏంటండీ? సినిమాల్లో అయితే ఎటువంటి ప్రభుత్వం ఉద్యోగిపైనానా.. అలాగే ఎలాంటి ప్రదేశంలోనైనా జోకులు వేయొచ్చు. కాని రియల్ లైఫ్ లో అలాగే చేసినందుకు మాత్రం.. ఒక సెక్సీ మోడల్ ఇప్పుడు జైలు ఊచలు లెక్కెట్టడానికి రెడీ అవుతోంది.
ఓ రెండు రోజుల క్రితం కంచన్ థాకూర్ అనే 27 ఏళ్ళ మోడల్.. తన స్నేహితురాళ్ళతో కలసి ముంబయ్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. అక్కడ వారు నలుగురూ టెర్మినల్ 2లో ఢిల్లీ విమానాశ్రయం ఎక్కాలి. అయితే తన స్నేహితురాలు ఒకామె బ్యాగ్ చెక్ చేస్తున్నప్పుడు.. ఆ అమ్మాయిని ఆట పట్టించాలని డిసైడైంది కంచన్. ఆమె బ్యాగులో బాంబ్ ఉందంటూ.. తనిఖీలు చేస్తున్న సి.ఐ.ఎస్.ఎఫ్ పోలీసులతో నవ్వుతూ చెప్పింది. వారు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని.. ఆ అమ్మాయిని పూర్తిగా చెక్ చేసి.. అప్పటికే ఎయిర్ ఇండియా విమానంలోకి ఎక్కించబడిన ఆమె బ్యాగేజ్ బయటకు తీయించి మరి తనిఖీలు చేశారు. విషయం చాలా సీరియస్ అయ్యిందని అర్దంచేసుకున్న కంచన్.. 'సారీ సార్.. నేను జోకేశా..' అంటూ బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా టైపులో సెలవిచ్చిందట.
సినిమాలో అయితే వావ్ వాటే అమాయకత్వం వాటే నిజాయితీ అంటూ నవ్వుకుంటాం.. కాని ఇక్కడ ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే ఆ నలుగురిని అక్కడే అరెస్టు చేశారు. ఎయిర్ ఇండియా విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది. విచారణ చేపట్టిన అధికారులు.. చెడ్డ రూమర్లను వ్యాప్తి చేసినందుకు ఐపిసి 505 (1) (బి) చట్టం క్రింద కంచన్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఆమెకు మూడు సంవత్సరాల కారాగార శిక్ష పడే ఛాన్సుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/