Begin typing your search above and press return to search.
100 కోట్ల క్లబ్‌లో హారర్ మూవీ
By: Tupaki Desk | 10 Jun 2015 11:30 AM GMT100కోట్ల వసూళ్ల క్లబ్ ఆల్వేస్ హాట్ టాపిక్. తెలుగులో ఇంకా అది సాధ్యపడనేలేదు. రాజమౌళి బాహుబలితోనే అది సాధ్యమవుతుందని అంచనాలేస్తున్నారంతా. ఇప్పటివరకూ అయితే స్టార్ హీరోలు సాధించలేని భారీ లక్ష్యమిది. ఓ దక్షిణాది సినిమా 100కోట్ల వసూళ్ల క్లబ్‌లో నిలవడమంటే ఆషామాషీ కానేకాదు.
తమిళ సూపర్‌స్టార్లు రజనీకాంత్, తళా అజిత్, పద్మశ్రీ కమల్‌హాసన్, ఇలయదళపతి విజయ్‌లకు మాత్రమే వంద కోట్ల క్లబ్ సాధ్యమైంది. అయితే ఇలాంటి స్టార్ పవర్ లేకుండానే ఓ హారర్ సినిమా 100కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాంచన 2తో లారెన్స్ మాష్టర్ ఈ ఫీట్ సాధించి చూపించారు. సింపుల్ కథ, కథనంతో తెరకెక్కిన కాంచన 2 హారర్ చిత్రాల రికార్డుల్నే తిరగరాసింది. ఏ స్టార్ హీరోకి తగ్గని రీతిలో వసూళ్లు సాధించి చూపించింది. ఈ సినిమా 7వ వారం, 8వ వారంలో కూడా హౌస్‌ఫుల్ వసూళ్లతో తమిళ బాక్సాఫీస్‌ని అల్లాడించింది. అంతేనా 100కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా లారెన్స్ మాష్టర్ క్రెడిట్.
తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా గంగ పేరుతో రిలీజై చక్కని వసూళ్లు సాధించింది. నిర్మాత బెల్లంకొండ సురేష్ అప్పుల్లో మెజారిటీ భాగం ఈ చిత్రం వల్ల తీరిపోయాయని అప్పట్లో చెప్పుకున్నారు. ఏదేమైనా కాంచన 2 విజయం అందరికీ కళ్లు తెరిపించే బోలెడు సత్యాల్ని ఆవిష్కరించింది. ముని 4, కాంచన 3, గంగ 2 .. ఇలా ముందుంది ముసళ్ల పండగ. లారెన్స్ ది గ్రేట్.