Begin typing your search above and press return to search.
మన సినిమా.. కొరియాలో రీమేక్
By: Tupaki Desk | 26 Dec 2015 4:25 AM GMTహారర్ సినిమాలంటే మన టాలీవుడ్ లో కామెడీ హారరే. కేవలం దెయ్యాల మీదనే కథను నడపకుండా.. దానికి ఒక హృదయాన్ని హత్తుకునే ఫ్లాష్ బ్యాక్ ను టచ్ చేసి.. అంతే కాకుండా తక్కిన సీన్లలో కామెడీని జత చేసి.. మనోళ్ళు రొటీన్ ఫార్ములా అయినప్పటికీ విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే ఇటువంటి సినిమాలు తీయడానికి లారెన్స్ మోనార్క్ అని చెప్పొచ్చు.
భయపెట్టే ప్రయత్నం చేసిన ప్రతిసారీ ఈ డ్యాన్స్ మాష్టర్ కు మాంచి సక్సెస్సే దక్కింది. ‘ముని’ - ‘కాంచన’ - ‘గంగ’ ఇలా వరుస చిత్రాలతో లారెన్స్ సందడి చేశారు. వాటిలో ‘కాంచన’ మూడు విదేశీ భాషల్లో రీమేక్ అవుతోంది. చైనా - కొరియన్ - థాయ్ ల్లో పునర్నిర్మిస్తున్నట్టు నిర్మాత పూదోట సుధీర్ కుమార్ తెలిపారు. ‘‘దక్షిణాది చిత్రాలు విదేశీ భాషల్లో పునర్నిర్మితమవ్వడం ఇదే తొలిసారి. మా ‘రామా’ పతాకంపై రీమేక్ చేస్తున్నాం. వీటితోపాటు కన్నడ - తెలుగుల్లోనూ నిర్మిస్తున్నామ’’ని తెలిపారు సుధీర్ కుమార్.
మామూలుగా మనోళ్లు కొరియన్ సినిమాలను..చైనీస్ యాక్షన్ సీన్లను ఫ్రీ-మేక్ చేసేస్తుంటారు. ఇప్పడు ఏకంగా మన సినిమానే అక్కడ రీమేక్ అవ్వడమంటే విడ్డూరమే. అప్పుడెప్పుడో చిరంజీవి నటించిన కొదమసింహం ఇలాగే హాలీవుడ్ లో రీమేక్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా. సూపర్ గురూ.