Begin typing your search above and press return to search.
పులికి 50, కంచెకి 10..ఉపయోగపడితేనే!
By: Tupaki Desk | 7 Sep 2015 7:49 AM GMTమెగా వారసుడు వరుణ్ తేజ్ కొత్త సినిమా కంచె యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న కంచె టీజర్ కి... అప్పుడే 10 లక్షల హిట్స్ వచ్చాయి. అది కూడా ఐదు రోజుల్లోనే. స్టార్ హీరోల సినిమాలకే ఈ ఫీట్ సాధ్యం. అలాంటిది కంచె కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే... ఈ మూవీ పై ఉన్న హైప్ అర్ధమవుతుంది. మరోవైపు.. విజయ్ హీరోగా వస్తున్న పులి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికే ఈ ట్రైలర్ కి 50 లక్షల క్లిక్స్ వచ్చాయి.
తమిళ ఇండస్ట్రీకే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పులి ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ పై యూనిట్ హ్యాపీగా ఉంది. అయితే ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఒకరకంగా ప్లస్ అయినా... అంచనాలను పెంచేస్తున్నాయి ఇలాంటి రికార్డులు.. తీరా కంటెంట్ లో ఏ మాత్రం క్వాలిటీ తగ్గినా... రిజల్ట్ ఘోరంగా ఉంటుందనే విషయం ఇప్పటికే స్పష్టమైంది.
కొలవెరి అంటూ ధనుష్ చేసిన ఓ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే... ఇదో చరిత్ర సృష్టించే సినిమా అనుకున్నారంతా. కోటికి పైగా యూట్యూబ్ క్లిక్స్ వచ్చినా.... కలెక్షన్ల విషయంలో లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు. మరీ అంత బ్యాడ్ కాకపోయినా... అంచనాలు అందుకోకపోతే మాత్రం ఎదురుదెబ్బ తప్పదనే విషయం గుర్తుంచుకోవాలి. కంటెంట్ ఉంటే కటౌట్ అక్కర్లేదని మనకు తెలుసు. అలాగే సినిమాలో కంటెంట్ ఉంటేనే ఇలాంటి రికార్డులు హెల్ప్ అవుతాయి తప్ప... మూవీకి ప్రమోషన్ కోసం మాత్రం కొంచెం కూడా హెల్ప్ చేయలేవు ఇలాంటివన్నీ.