Begin typing your search above and press return to search.
ఏంటి పరిస్థితి? ఎవరు గెలిచారు?
By: Tupaki Desk | 23 Oct 2015 3:57 AM GMTనిజానికి నిన్న మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయ్. అందులో వార్ డ్రామాతో వచ్చిన 'కంచె' ప్రధానం అయితే.. లవ్ స్టోరీగా వచ్చిన 'కొలంబస్' సినిమా, అలాగే హారర్ కామెడీగా తెరకెక్కిన 'రాజు గారి గది' సినిమా మిగిలిన రెండూ. ఇంతకీ ఈ మూడు సినిమాల్లో ఎవరు ఎంతగా ఆకట్టుకున్నారనే టాక్ నడుస్తోందంటారూ? పదండి చూద్దాం.
'కంచె' సినిమాకు క్లాస్ అండ్ క్లాసిక్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడం కాయం. కాని హీరోయిజమే కావాలి.. పాటల్లో స్టెప్పులు పడాలి.. బ్రహీ క్యారెక్టర్ సెకండాఫ్ లో రావాలి.. అనే మాస్ బాబాయ్ లకు మాత్రం సినిమా పెద్దగా ఎక్కదు. సో.. బి | సి సెంటర్లలో కలెక్షన్లపరంగా కాస్త దెబ్బ పడినట్లే. ఓ రెండు రోజులు గడిస్తే కాని అక్కడ రిసెప్షన్ ఎలా ఉందో చెప్పగలుగుతాం. ఇకపోతే మనోళ్లు 'కొలంబస్' ఇదో ప్రేమ డిస్కవరీ అంటూ ప్రచారం చేసిన సినిమాకు మాత్రం అంత క్రేజేం రాలేదు. ఏదో ఒక మామూలు లవ్ స్టోరీ అనిపించుకుంది అంతే. అలాగే 'రాజుగారి గది' సినిమా కూడా. మొదటి హాఫ్ లో కామెడీ సూపర్ అనిపించినా.. తరువాత మాత్రం దొరికిపోయారు. అందుకే సినిమాకు యావరేజ్ టాకే వచ్చింది.
ఇలా ఉండగా.. ఈ మూడు సినిమాలు మిక్సడ్ రిజల్టు అయితే.. మరి అందరికంటే ఎక్కువ ప్లస్సు రుద్రమదేవి సినిమాకే అంటారా? లేకపోతే బ్రూస్ లీ బాబూ ఏదైనా అడ్వాంటేజ్ కొల్లగొడతాడా? వెయిట్ అండ్ సి.