Begin typing your search above and press return to search.
కంచె అక్కడ బాగానే దంచుతోంది
By: Tupaki Desk | 25 Oct 2015 4:11 AM GMT‘కంచె’ లాంటి సినిమా కలెక్షన్లు కుమ్మేస్తుందని బహుశా దర్శక నిర్మాతలు కూడా ఆశించి ఉండరు. ఈ టైపు సినిమాలకు మంచి సినిమా అన్న పేరైతే వస్తుంది కానీ.. కలెక్షన్లు అంత ఎంకరేజింగ్ గా ఉండవు. ఐతే చాలా మంచి సినిమా అన్న టాక్ అంతటా ఉండటం, మంచి రివ్యూలు రావడం.. దసరా సెలవులు కూడా కలిసి రావడంతో ‘కంచె’ కలెక్షన్లు పర్వాలేదనిపించేలాగే ఉన్నాయి. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.3.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపితే షేర్ రూ.5 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే ఇది తక్కువ మొత్తమే కానీ.. బి - సి సెంటర్లలో సినిమాకు సరైన ఓపెనింగ్స్ రాని నేపథ్యంలో ఈ ఫిగర్స్ పర్వాలేదనే చెప్పాలి. మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే యుఎస్ లో కంచె బాగానే ప్రభావం చూపిస్తోంది. అక్కడ రెండు రోజుల్లో కలిపి 2 లక్షల డాలర్లు వసూలు చేసింది ‘కంచె’. విశేషం ఏంటంటే.. ‘కంచె’కు పోటీగా విడుదలైన బాలీవుడ్ సినిమా ‘షాన్ దార్’ తొలి రెండు రోజుల్లో 1.34 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. అమెరికాలో వందకు పైగా స్క్రీన్ లలో నడుస్తోంది కంచె. అన్ని చోట్లా బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. ‘కంచె’ యుఎస్ రైట్స్ రూ.1.3 కోట్లకు అమ్మారు. కాబట్టి బయ్యర్ లాభాల బాట పట్టడం ఖాయం.