Begin typing your search above and press return to search.
గాంధీ జయంతికి `కంచె`!
By: Tupaki Desk | 13 July 2015 2:49 PM GMTమనసుల మధ్యనున్న కంచెల్ని తొలగించాలని చెప్పే ఓ సిపాయి కథతో `కంచె` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఎప్పుడూ సోషల్ ఎలిమెంట్స్‌తో సినిమాలు తీసే ఆయన ఈసారి దేశభక్తి ప్రధానంగా సినిమాని తీస్తున్నాడు. మెగా హీరో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకొస్తున్నట్టు సమాచారం. `కృష్ణం వందే జగద్గురుమ్` తర్వాత క్రిష్ తెలుగులో మరో సినిమా చేయలేదు. బాలీవుడ్‌లో `ఠాగూర్`ని `గబ్బర్` పేరుతో రీమేక్ చేశాడు. అయితే ఆ చిత్రానికి అక్కడ మిశ్రమ స్పందన లభించింది. ఆ వెంటనే వరుణ్‌తేజ్‌తో `కంచె` మొదలుపెట్టి శరవేగంగా పూర్తి చేశాడు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొన్న `కంచె`ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ జనాలు చెప్పారు. కానీ క్రిష్ బాలీవుడ్ వెళ్లొచ్చిన ఫలితమేమో తెలియదు కానీ... సినిమా పూర్తయినా మరో రెండు నెలల వరకు చిత్రాన్ని విడుదల చేయకూడదని నిర్ణయించకున్నాడు. అప్పటిదాకా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు, ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టబోతున్నాడు. బాలీవుడ్‌లో సినిమా విడుదల తేదీని రెండు మూడు నెలల ముందుగానే ప్రకటిస్తుంటారు. ఒక్కోసారి సినిమాకి కొబ్బరికాయ కొట్టినవెంటనే ప్రకటిస్తుంటారు. ఇప్పుడు క్రిష్ కూడా తన `కంచె`ని రెండు నెలల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. చూస్తుంటే వరుణ్‌తేజ్ ఇటీవలే మొదలుపెట్టిన `లోఫర్`, ఈ కంచె ఒకేసారి ప్రేక్షకుల ముందుకొచ్చేలా కనిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ చాలా వేగంగా సినిమాలు తీస్తాడు కాబట్టి ఆ అవకాశం లేకపోలేదు.