Begin typing your search above and press return to search.
దసరా.. ఇరుకెక్కువైపోయింది బాసూ!
By: Tupaki Desk | 17 Oct 2015 1:30 PM GMTవాయిదా పడింది.. ఒక్కటంటే ఒక్క సినిమా. కానీ దాని ప్లేసులోకి మరీ మూడు సినిమాలు వచ్చి పడటమే విడ్డూరంగా ఉంది. పైగా ఆ మూడింట్లో రెండు పెద్ద సినిమాలు. మూడోది కూడా కాస్త ఆసక్తి రేపుతున్న సినిమానే. దీంతో దసరాకి మరీ ఇరుకు ఎక్కువైపోతోందేమో అన్న ఫీలింగ్ కలుగుతోంది. ఇన్ని సినిమాలకు థియేటర్లు ఎలా సర్దుబాటు చేస్తారన్నది అంతు బట్టకుండా ఉంది.
22న రావాల్సిన ‘అఖిల్’ సినిమా వాయిదా అన్న ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే.. అదే తేదీకి మూడు సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. వీటిలో అన్నిటికంటే ఆసక్తి రేపుతున్న, భారీగా విడుదల కాబోతున్న సినిమా ‘కంచె’. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్ చూసి ఇప్పటికే ప్రేక్షకుల కళ్లు చెదిరిపోయాయి. సినిమా మీద జనాలు భారీ అంచనాలతోనే ఉన్నారు. కాబట్టి విడుదల భారీగానే ఉంటుంది.
ఇక ‘పటాస్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా కావడంతో ‘షేర్’ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి కూడా ఓ మోస్తరుగా థియేటర్లివ్వాల్సిందే. ఇక సాయి కొర్రపాటి, అనిల్ సుంకర లాంటి పెద్ద నిర్మాతలు సమర్పకులుగా వ్యవహరిస్తున్న సినిమా కాబట్టి ‘రాజు గారి గది’కి కూడా హడావుడిగా బాగానే ఉంటుంది. ఐతే రుద్రమదేవి, బ్రూస్ లీ సినిమాల కథ దసరాకంతా ముగిసే అవకాశాలేమీ లేవు. మరి ఈ రెండూ ఖాళీ కాకుండా ఇంకో మూడు సినిమాలకు థియేటర్లు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.