Begin typing your search above and press return to search.
గేయ రచయిత కందికొండ కన్నుమూత
By: Tupaki Desk | 12 March 2022 1:06 PM GMTవెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చాలా చిత్రాలకు సూపర్ హిట్ పాటల్ని అందించి రచయితగా మంచయి పేరు తెచ్చుకున్న గేయ రచయిత కందికొండ (49) కన్నుమూశారు. గత కొంత కాలంగా నోటి క్యాన్సర్ కారణంగా బాధపడుతూ వున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
నగరంలోని వెంగళరావు నగర్ లో నివాసం వుంటున్న కందికొండ అక్కడే తన తుది శ్వాసని విడిచారు. కందికొండ అసలు పేరు కందికొండ యాదగిరి.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కందికొండ ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యంపై వున్న ఆసక్తి కారణంగా ఆయన సినిమాల్లోకి ప్రవేశించారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` చిత్రంతో ఆయన సినీ గేయరచయితగా కెరీర్ ప్రారంభించారు. ఇందులో ఆయన రాసిన తొలి పాట `మళ్లి కూయవే గువ్వా ..` ఈ పాట ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఈ సినిమా తరువాత ఆయనకు తెలుగు చిత్ర సీమలో వరుసగా అవకావాలు వెతుక్కుంటూ వచ్చాయి. `ఇడియట్` లో `చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..., సత్యంలో మధురమే మధురమే..., ఐయామ్ ఇన్ లవ్.., `పోకిరి`లో గల గల పారుతున్న గోదారిలా.. జగడమే... `లవ్‌లీ`లో .. లవ్ లీ లవ్ లీ.. పాటలు రాశారు. చివరగా ఆయన 2018లో వచ్చిన `నీది నాది ఒకే కథ` చిత్రంలో రెండు పాటలు రాశారు. గత కొంత కాలంగా వెన్నముక సమస్య కారణంగా కందికొండ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ సమస్య కారణంగా ఆయన హాస్పిటల్ లో చేరారు. దీంతో కందికొండ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. అదే సమయంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో వారి కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబానికి అండగా నిలిచింది. కందికొండ చికిత్సకు అయ్యే ఖర్చుల్ని భరించింది.
అయితే కొన్ని రోజులు నిలకడగానే వున్న కందికొండ ఆరోగ్యం తాజాగా క్షీణించడంతో ఆయన శనివారం తుది శ్వాస విడిచారని డాక్టర్లు వెల్లడించారు. కందికొండ మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.