Begin typing your search above and press return to search.
పిల్ల గుంగూబాయిని కడిగేసిన కంగన
By: Tupaki Desk | 15 Feb 2022 11:30 PM GMTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిప్పులు చెరిగితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అదీ సోషల్ కాజ్ ని ఎంచుకుని కంగన బరిలోకి దిగిందంటే సన్నివేశం బాలయ్య సినిమా సీన్లనే తలపిస్తుంది. కంగనకి ప్రత్యర్ధి ఎలాంటి వారైనా డోంట్ కేర్ అంటూ ముందుకు దూసుకుపోయే నైజం. ఆమెలోని తెగింపు...పౌరుషం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా క్వీన్ మరోసారి సోషల్ మీడియా వేదికగా చెలరేగింది.
ఈసారి టార్గెట్ అలియాభట్ సినిమా `గంగుబాయి కతియవాడి`. ఈ సినిమాని అడ్డు పెట్టుకుని కంగన ప్రధాని మోదీ పీఠమే కదిలిపోయేలా చెలరేగింది. అసలు సంగతి లోకి వెళ్తే..
ఇటీవలే `గంగూబాయి కతియావాడి` ట్రైలర్ రిలీజ్ అయి సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అలియా పవర్ ఫుల్ డైలాగులు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అమ్మడి ఆహార్యం..అభినయం తో ట్రైలర్ చూస్తేనే గంగుబాయి కొట్టేస్తుంది అని అంచనాలు మొదలయ్యాయి. ఒక్క ట్రైలర్ సినిమాని పీక్స్ కి తీసుకెళ్లింది. సోషల్ మీడియా లో ఇన్ స్టా రీల్స్..మీమ్స్ విపరీతంగా మొదలయ్యాయి. సరిగ్గా కొన్ని రోజుల క్రితం ఓ చిన్న పాప గంగూబాయిలో ముస్తాబై డైలాగులు చెబుతూ ఓ వీడియో చేసింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చంగా గంగుబాయిని దించేసింది ఆ పాప.
ఈ వీడియో కంగన కళ్లలో పడింది. దీంతో కంగన అగ్గిమీద గుగ్గిలం అయింది. పిల్లలు ఇలా చేస్తుంటే తల్లిదండ్రలు ఏం చేస్తున్నారు? ఈ పాప తల్లిదండ్రులపై కేసు పెట్టాలని మండిపడింది. ఇలాంటి వాటిని పేరెంట్స్ ఎలా ఎంకరజ్ చేస్తారు? వాళ్ల భవిష్యత్ ఏమైపోతుందని ఆవేదన ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి అమ్మాయిలను సరఫరా చేసి అధికారిలోకి వచ్చిన ప్రముఖ వేశ్య-పింప్ బయోపిక్ ని ప్రచారం చేయడానికి డబ్బు కోసం తక్కువ వయసుగల పిల్లల్ని విక్రయించడం..లైంగిక వేధింపులకు పాల్పడేలా చర్యలు తీసుకుంటోన్న తల్లిదండ్రుల్ని కఠినంగా శిక్షించాలని కంగన మండిపడింది.
ఇలాంటి వాటిపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. శిశు మంత్రిత్వ అభివృద్ది శాఖకు ఇలాంటి విషయాలు చేరవేయాలని కంగన ఫైర్ అయింది. ఆ పాప ముస్తాబైన తీరు..అసభ్యకర డైలాగులు..నోటిలో బీడీ తో గంగుబాయిని అనుకరించాలా? ఆమె బాడీ లాంగ్వేజ్ చూడండి? ఈ వయసులో ఆ పాపకు ఇలాంటివన్ని అవసరమా? ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. భావితరాల భవిష్యత్ ఇంతేనా? అని కంగన వ్యాఖ్యానించింది.
రిలీజ్ కి ముందే `గంగూబాయి కతియావాడి` ఇంత సంచలనం సృష్టిస్తే..రిలీజ్ తర్వాత ఇంకే స్థాయిలో ఉంటుందో? ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 25న చిత్రం రిలీజ్ కానుంది.