Begin typing your search above and press return to search.

70శాతం కంగ‌న‌ కే క్రెడిట్

By:  Tupaki Desk   |   18 Dec 2018 9:34 AM GMT
70శాతం కంగ‌న‌ కే క్రెడిట్
X
క్వీన్ కంగ‌న న‌టించిన `మ‌ణిక‌ర్ణిక‌` జ‌న‌వ‌రి 25న ప్ర‌పంచ‌వ్యాప్తం గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ - మ‌హానాయ‌కుడు` సినిమా తో పాటు ఈ సినిమా రిప‌బ్లిక్ డే కానుక‌ గా రిలీజ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే ఇరు సినిమాల‌కు దేశ‌వ్యాప్తం గా క్రేజు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఇక క్వీన్ సినిమా కి కంగ‌న అన్నీ తానే అయ్యి ప‌ని చేసింది. అప్ప‌ట్లో ఈ సినిమా ద‌ర్శ‌కుడు క్రిష్ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుని `ఎన్టీఆర్ బ‌యోపిక్‌`తో బిజీ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే కంగ‌న స్వ‌యంగా ద‌ర్శ‌కురాలి గా మారి `మ‌ణిక‌ర్ణిక‌` బ్యాలెన్స్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసింది.

అస‌లు ఈ సినిమా మేకింగ్ లో కంగ‌న భాగ‌స్వామ్యం ఎంత‌? అని నిర్మాత క‌మ‌ల్ జైన్ ని ప్ర‌శ్నిస్తే.. 70 శాతం క్రెడిట్ త‌న‌ కే ద‌క్కుతుంద‌ని తెలిపాడు. అయినా ద‌ర్శ‌కురాలి గా టైటిల్ క్రెడిట్ ఇవ్వ‌డం లేద‌ని తెలిపారు. 70 శాతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది కంగ‌న‌నే. సినిమా మేకింగ్‌ లో ప్ర‌తి విభాగం లో త‌న ఇన్వాల్వ్ మెంట్ ఉంది. కాస్ట్యూమ్స్- డైరెక్ష‌న్- ఆర్ట్- కెమెరా యాంగిల్స్ ప్ర‌తిదీ కంగ‌న చ‌లువే. కంగ‌న చాలా ప్రొఫెష‌న‌ల్.. ప్రొఫిషియెంట్‌! అంటూ పొగిడేశారు.

ఇక‌పోతే మ‌ణిక‌ర్ణిక ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది. ఈ ట్రైల‌ర్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే క్వీన్ ఝాన్సీ రాణి సింహాస‌నం లో కుర్చుని ఉన్న ఫోటోల్ని రివీల్ చేశారు. సింహాస‌నం పై త‌న వార‌సుడి తో క‌లిసి ఝాన్సీ రాణి రాజ‌సం ప్ర‌ద‌ర్శిస్తున్న ఫోటోలు ఆక‌ట్టుకున్నాయి. అతుల్ కుల‌క‌ర్ణి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. టీవీ స్టార్ అంకిత లోఖండే ఓ అద్భుత‌మైన పాత్ర‌ లో న‌టించింద‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కి డైరెక్ట‌ర్ గా టైటిల్ క్రెడిట్ మాత్రం క్రిష్ కే ఉంటుంద‌ని నిర్మాత‌లు ఇది వ‌ర‌కూ తెలిపిన సంగ‌తి తెలిసిందే.