Begin typing your search above and press return to search.
బ్రహ్మాస్త్ర డిజాస్టర్ అంటూ కంగన వీరంగం!
By: Tupaki Desk | 10 Sep 2022 4:53 AM GMTరణబీర్ కపూర్- ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన బ్రహ్మాస్త్ర ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సమీక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. అయితే ఇంతలోనే ఈ మూవీ డిజాస్టర్ రిజల్ట్ ఖాయమని తేల్చేసింది క్వీన్ కంగన రనౌత్. అంతేకాదు పీవీఆర్- ఐనాక్స్ సంస్థలకు దాదాపు 800 కోట్లు నష్టం తప్పదని కూడా లెక్కలు చెప్పేసింది.
తాజా ప్రకటనలో కంగన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. రణబీర్ కపూర్ - అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర PVR- ఐనాక్స్ పెట్టుబడిదారుల 800 కోట్ల రూపాయల సంపదను తుడిచిపెట్టడం ఖాయమని వ్యాఖ్యానించింది.
బ్రహ్మాస్త్ర నిర్మాతలు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించిన కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని డిజాస్టర్ గా పేర్కొంది. తన సమీక్షలో బ్రహ్మాస్త్రాను డిజాస్టర్ గా అభివర్ణించిన ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కాడెల్ ట్వీట్ ను పంచుకున్న కంగనా కరణ్ జోహార్.. అలియా- రణబీర్ లను ఉత్తమ నటులుగా పిలవమని ప్రజలను బలవంతం చేయడం ద్వారా అబద్ధాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని కంగన విమర్శించింది. తన జీవితంలో ఎప్పుడూ మంచి సినిమా చేయని దర్శకుడి కోసం రూ. 600 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేయడం ద్వారా అయాన్ ముఖర్జీని మేధావి అని పిలవడంపై ఆమె విరుచుకుపడింది.
బ్రహ్మాస్త్రానికి నిధులు ఇవ్వడానికి భారతదేశంలోని ఫాక్స్ స్టూడియో తనను తాను విక్రయించాల్సి వచ్చిందని .. వారి పిచ్చి కారణంగా ఎన్ని స్టూడియోలు మూసివేయబడతాయో ఊహించలేమని కూడా అంది. ఆ తర్వాత బ్రహ్మాస్త్రపై వ్యాపార బాక్సాఫీస్ నివేదికపై వ్యాఖ్యానిస్తూ... ఈ చిత్రం PVR - ఐనాక్స్ పెట్టుబడిదారుల 800 కోట్ల రూపాయల సంపదను తుడిచిపెట్టిందని నివేదించింది.
తమ గ్రూపిజం తమను కాటేయడానికి వస్తోందని కంగనా అన్నారు. బ్రహ్మాస్త్ర నిర్మాతలు బేబీ పిఆర్ ని.. మీడియాను నియంత్రిస్తున్నారని.. కమల్ ఆర్ ఖాన్ అకా కెఆర్ కెను జైల్లో పెట్టారని కంగన అంది. నిజాయితీ లేని సినిమాను నిజమేనని నమ్మించేందుకు టిక్కెట్ లు కొనిచ్చారని ఆమె ఆరోపించారు.
మరో పోస్ట్ లో తమ సినిమాలను గొప్పగా చేయడానికి దేశంలో ఒక్క అంతర్జాతీయ స్టూడియో కూడా పరిశ్రమకు లేదని పేర్కొంది. సినిమా మాఫియా వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకున్నారని వీళ్లందరినీ ఎండగట్టాలని కంగన పిలుపునిచ్చింది. స్టూడియోలు లేనప్పుడు సాంప్రదాయ ఫైనాన్షియర్లు - వ్యక్తిగత సన్నిహితులైన నిర్మాతలు దొరకడం చాలా అరుదు అని.. మునుముందు మనం సినిమాలు ఎలా తీయాలి? అని కూడా కంగన ప్రశ్నించింది. కంగన బిగ్ బ్లాస్ట్ పై బ్రహ్మాస్త్ర నిర్మాతలు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.