Begin typing your search above and press return to search.
5 కోట్ల విలువ చేసే కొత్త లగ్జరీ బెంజ్ కొట్టేసిన కంగన!
By: Tupaki Desk | 21 May 2022 4:47 AM GMTకంగనా రనౌత్ నటించిన భారీ యాక్షన్ ప్యాక్డ్ సినిమా 'ధాకడ్' గ్రాండ్ గా విడుదలైంది. కార్తీక్ ఆర్యన్ భూల్ భులయా 2తో ఈ చిత్రం పోటీపడుతోంది. రజ్నీష్ ఘై దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కంగన నెవ్వర్ బిఫోర్ అనేలా యాక్షన్-ప్యాక్డ్ అవతార్ లో కొన్ని హై-ఆక్టేన్ స్టంట్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో దుమ్ము దులిపేసిందని సమాచారం. అయితే సరిగ్గా ధాకడ్ విడుదలకు ముందు కంగన రనౌత్ సరికొత్త లగ్జరీ కార్ తో చిందులు వేయాలని ప్లాన్ చేయడం చర్చనీయాంశమైంది.
వాస్తవానికి.. కంగనా రనౌత్ మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ S680 కి గర్వించదగిన యజమాని అయ్యింది. దీని ఖరీదు సుమారు 5కోట్లు. తాజా కథనాల ప్రకారం.. మేబ్యాక్ S680 AMG.. 6.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ 12-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు 9-స్పీడ్ గేర్ బాక్స్ .. ఆల్ వీల్ డ్రైవ్ తో అమరికను కలిగి ఉంది.
ఇది మృగాన్ని తలపించే ఇంజిన్ తో డిజైన్ చేసినది. 4.5 సెకన్లలో 0-100కు స్పీడ్ అందుకుంటుందట. ఆసక్తికరంగా ఈ లగ్జరీ కార్ బేస్ మోడల్ ధర రూ. 3.50 కోట్లు. కంగనా రనౌత్ కొనుగోలు చేసిన వెర్షన్ విలువ రూ. 5 కోట్లు.
ఈ భారీ ధర ట్యాగ్ కనిపించింది. పైగా ఈ కార్ ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉన్నందున డ్రైవర్‌కు కొన్ని తాజా సాంకేతిక అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది రకరకాల అధునాతన సౌకర్యాలను కలిగి ఉన్న కార్ అని తెలిసింది.
తాజా రిపోర్ట్ ప్రకారం ధాకడ్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా అలరిస్తోంది. కొన్ని నెగెటివ్ స్పందనలు వ్యక్తమవుతున్నా ఈ మూవీకి ఆరంభ వసూళ్ల పరంగా ఢోఖా లేదని తెలుస్తోంది. కంగనా రనౌత్ తేజస్ చిత్రంతో పాటు సాయి కబీర్ దర్శకత్వం వహిస్తున్న 'టికు వెడ్స్ షేరు'లో కూడా కనిపిస్తుంది.
తదుపరి పలు భారీ చిత్రాల్లో నటించేందుకు కంగన బిగ్ ప్లానింగ్ తో ఉంది. ముఖ్యంగా సౌత్ పాన్ ఇండియా హీరోలపై కంగన కన్నేసిందని ఇటీవలి తన మాటల తూటాల్లో బయటపడింది.