Begin typing your search above and press return to search.
ఆలియా అందమైన మూర్ఖురాలు.. గంగూబాయి రాంగ్ కాస్టింగ్!- కంగన
By: Tupaki Desk | 20 Feb 2022 11:38 AM GMTబాలీవుడ్ లో నటవారసత్వాన్ని నిలదీయడంలో కంగన రనౌత్ ఎప్పుడూ ముందుంటుంది. బాలీవుడ్ మాఫియాని తూర్పారబట్టడంలోనూ ఏమాత్రం వెనకంజ వేయదు. సూటిగా ప్రముఖ దర్శకులు నిర్మాతలను అగ్ర హీరోల్ని టార్గెట్ చేస్తూ ప్రతిసారీ హీటెక్కిస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో ప్రముఖ రాజకీయ నాయకులకు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది కంగన.
ఇంతకుముందు సంజయ్ లీలా భన్సాలీ.. మహేష్ భట్ లాంటి గొప్ప అగ్ర దర్శకనిర్మాతలపై తీవ్రంగా విరుచుకుపడింది కంగన. బాలీవుడ్ లో మాఫియా సంస్కృతికి తెర తీసిన దుర్మార్గులు అంటూ తిట్టేసింది. ఇప్పుడు మరోసారి గంగూభాయి కతియావాడీ రిలీజ్ ముంగిట మరోసారి ఆ ఇద్దరిపైనా చెలరేగింది కంగన.
ఈ సినిమాకి రాంగ్ కాస్టింగ్ ఎంపిక చేశారని .. ఆలియా ఒక బింబో! అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది కంగన. ఒక అందమైన మూర్ఖురాలు (బింబో) ఆలియా అని విమర్శించింది. అంతేకాదు.. చిత్రనిర్మాత కరణ్ జోహార్ `పాపా కి పరి` అని వ్యాఖ్యానించింది కంగన. ఆదివారం కంగనా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఈ వ్యాఖ్యలు రాసింది.
అక్కడ ఆమె ఒక నిగూఢమైన పోస్ట్ లో ఇలా రాసింది. ``ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు... ఒక పాప (సినిమా మాఫియా డాడీ) కి పారి (బ్రిటీష్ ని ఉంచడానికి ఇష్టపడే వ్యక్తి) .. ఎందుకంటే పాపా రోమ్ కామ్ బింబో పని చేయగలదని నిరూపించాలనుకుంటున్నారు...`` అని వ్యాఖ్యానించింది.
ఈ చిత్రానికి అతి పెద్ద లోపం తప్పుడు కాస్టింగ్... యే నహీ సుధ్రేంగే సౌత్ .. హాలీవుడ్ చిత్రాలకు స్క్రీన్ ప్లేలు రావడంలో ఆశ్చర్యం లేదు... బాలీవుడ్ డూమ్ జబ్ తక్ మూవీ మాఫియాకు అధికారం ఉంది.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ మాఫియా డాడీ..(కరణ్..) హిందీ చిత్రసీమలో పని సంస్కృతిని నాశనం చేసాడని ఆమె మరో పోస్ట్ లో పేర్కొంది. సినిమా పరిశ్రమలో వర్క్ కల్చర్ ను ఒంటరిగా నాశనం చేసిన చాలా మంది పెద్ద దర్శకుల(భన్సాలీ సహా పలువురు)ను ఎమోషనల్ గా మానిప్యులేట్ చేసాడు.
వారి సినిమాటిక్ బ్రిలియన్స్ పై తన సాధారణ ఉత్పత్తులను బలవంతంగా రుద్దిన బాలీవుడ్ మాఫియా డాడీ పాపా జో ఈ విడుదల తర్వాత త్వరలో మరొక ఉదాహరణ అని నిరూపిస్తాడు`` అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ప్రజలు అతనిని అలరించడం మానేయాలి. ఈ శుక్రవారం విడుదలలో పెద్ద హీరో .. గొప్ప దర్శకుడు కూడా అతని అవకతవకలకు కొత్త బాధితులు. గంగూబాయి కతియావాడి లో విజయ్ రాజ్- సీమా పహ్వా - అజయ్ దేవగన్ కూడా నటించారు. అంటే ఆలియాతో పాటు దేవగన్ ని కూడా తప్పుడు కాస్టింగ్ అంటూ కంగన విమర్శించినట్టే భావించాలి.
ఇక గంగూభాయి కతియావాడీని జయంతిలాల్ గడాతో కలిసి భన్సాలీ నిర్మించగా కరణ్ జోహార్ కోప్రొడ్యూసర్ గా పంపిణీదారుగా ఉన్నారు. కళాత్మక చిత్రాల దర్శకుడు భన్సాలీ రూపొందించిన గంగూభాయి కతియావాడీ ట్రైలర్ కి అద్భుత స్పందన వచ్చింది. దాదాపు 200 కోట్లతో ఈ సినిమా తెరకెక్కింది.