Begin typing your search above and press return to search.

పదహారేళ్ళ వయసుకే కంగన ఫైర్ బ్రాండ్!

By:  Tupaki Desk   |   5 Jan 2019 9:58 AM GMT
పదహారేళ్ళ వయసుకే కంగన ఫైర్ బ్రాండ్!
X
బాలీవుడ్ క్వీన్ గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్ సినిమాల్లో బోల్డ్ పాత్రలు పోషించడమే కాకుండా నిజజీవితంలో కూడా బోల్డ్ గా ఉంటుంది. ఏ విషయం పైన మాట్లాడాల్సి వచ్చినా కుండ బద్దలు కొట్టినట్టు తన మనసుకు అనిపించింది మాట్లాడుతుంది. అలా మాట్లాడినందుకు వివాదాలలో ఇరుక్కున్న సందర్భాలు బోలెడు. అయినా తన పంథా మార్చుకోకుండా ముందుకు వెళ్తోంది కంగన.

కంగన ప్రస్తుతం 'మణికర్ణిక- ది క్వీన్ అఫ్ ఝాన్సి' ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇలా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లైంగిక వేధింపుల గురించి ఒక బాంబు పేల్చింది. తనకెదురైన సమస్యకు బాధపడుతూ కూర్చోకుండా 16 ఏళ్ళ వయసులోనే మొదటి సారి లైంగిక వేధింపులపై కేసు ఫైల్ చేసినట్టు తెలిపింది. మహిళా సాధికారిత గురించి మనసులో ఆలోచన రాకముందే మహిళలకు సాధికారత ఉండాలని తాను భావిస్తానని తెలిపింది. అంటే.. కంగన చిన్ననాటి నుండే ఫైర్ బ్రాండ్ అన్నమాట!

ఇదిలా ఉంటే 'మణికర్ణిక' రిపబ్లిక్ డే వీకెండ్ లో జనవరి 25 న విడుదల కానుంది. ఈ సినిమాలో వీరనారి ఝాన్సి రాణి పాత్రలో నటించింది. ఈపాత్ర కోసం గుర్రపు స్వారీ.. కత్తి యుద్ధం లాంటి వాటిలో ప్రత్యేక శిక్షణ తీసుకొని మరీ నటించింది. మెజారిటీ భాగం సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడు క్రిష్ తప్పుకోవడంతో కంగన దర్శకత్వ భాద్యతలు చేపట్టి సినిమాను దిగ్విజయంగా పూర్తి చేసింది.