Begin typing your search above and press return to search.
కంగనాకు ఇక్కట్లు.. కోర్టుపై నమ్మకం పోయిందట!
By: Tupaki Desk | 21 Sep 2021 7:32 AM GMTనటి కంగనా రనౌత్ కు కోర్టులో ఇక్కట్లు ఎదురవుతున్నట్టుగా ఉన్నాయి. ఆమె తన విషయంలో చేసిన వ్యాఖ్యలపై రచయిత జావేద్ అక్తార్ పరువు నష్టం దావా ఒకటి వేశారు. చాన్నాళ్ల పాటు దాని విచారణను తప్పించుకుంటూ వచ్చింది కంగనా. అయితే ఇటీవలే కోర్టు గట్టిగా హెచ్చరించింది.. విచారణకు హాజరు కాకపోతే అరెస్టు వారెంట్ ను జారీ చేయాల్సి ఉంటుందని ఆ ముంబై కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణకు కంగనా వచ్చి తీరాలని పేర్కొంది. అప్పటికి కంగనాకు కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయంటూ ఆమె లాయర్ బయటపడే ప్రయత్నం చేశారు. అయితే కోర్టు మాత్రం తదుపరి విచారణకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో కంగనా కోర్టుకు హాజరైంది.
అయితే ఈ హాజరీ తర్వాత ఆమెకు కోర్టు మీదే నమ్మకం పోయిందట. అందుకే తన కేసును వేరే న్యాయస్థానం విచారించాలంటూ మరో పిటిషన్ పెట్టుకుందట. ప్రస్తుతం విచారిస్తున్న కోర్టులో న్యాయం జరుగుతుందని తనకు నమ్మకం లేదని ఆమె అంటోందట. అందుకే కేసును వేరే కోర్టుకు మార్చాలని అంటోందట. మరి ఒక్కసారి విచారణకు హాజరు కాక తప్పని సరి పరిస్థితి ఏర్పడే సరికి కంగనాకు ఇలాంటి భావన కలిగిందేమో!
తన నోటికి హద్దూ అదుపు లేనట్టుగా ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటుంది కంగనా. దీంతోనే ఇలాంటి కేసుల చిక్కులు ఆమెకు ఎదురవుతున్నట్టుగా ఉన్నాయి. అయితే జావేద్ అక్తర్ వ్యవహారం కోర్టు వరకూ రావడంతో.. ఈమెకు ఒక కోర్టు మీద నమ్మకం పోయినట్టుగా ఉంది. మరి మరో కోర్టుకు ఈ విచారణ మారితే అక్కడేం జరుగుతుందనేది ఆసక్తిదాయకమైన అంశం.
అలాగే జావేద్ అక్తర్ పై కూడా ఈమె ప్రతి పిటిషన్ వేసిందట. ఆయన వేసిన దావా నేపథ్యంలో రివర్స్ లో కంగనా మరో పిటిషన్ ను దాఖలు చేసినట్టుగా ఉంది.