Begin typing your search above and press return to search.
#తలైవి.. జయలలిత రూపాల్లో కంగన పరకాయం
By: Tupaki Desk | 22 March 2021 9:56 AM GMTఅమ్మ జయలలిత బయోపిక్ తలైవి ప్రస్తుతం అన్ని పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్. ఈ సినిమాని తమిళం-తెలుగు-హిందీలో ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీకోసం కంగన ప్రాణం పెట్టి నటిస్తోంది.
జయలలిత వివిధ దశల్లో ఏ రూపంలో ఉండేవారు ఆ రూపాల్లో కనిపించేందుకు కంగన చాలానే మేకోవర్ ప్రయత్నించారు. జయలలిత కథానాయికగా ఉన్నప్పుడు.. యుక్తవయస్కురాలిగా.. మధ్య వయసులో నటిగా.. రాజకీయ నాయకురాలు అయ్యాక.. ఇలా రకరకాల రూపాలకు మారేందుకు కంగన చాలానే సాహసాలు చేశారు.
ముఖ్యంగా 20 కేజీల బరువు పెరగడం తగ్గడం అంటే ఆషామాషీనా.. అదంతా పెద్ద తెరపై తన పాత్ర కోసం చేసిన సాహసం. కంగనా లుక్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శారీరక పరివర్తనలో ఇది చాలా కఠినమైనది. 20 కిలోలు పెరగడం.. కొన్ని నెలల వ్యవధిలోనే తిరిగి బరువు కోల్పోవడం చాలా ఇబ్బందికరమైనది కూడా.
దీనికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసిన కంగన ..తలైవి ట్రైలర్ లాంచ్ కోసం రెడీ అవుతున్నామని తెలిపారు. ``ఈ ఎపిక్ బయోపిక్ చిత్రీకరణలో నేను ఎదుర్కొన్న ఏకైక సవాలు 20 కిలోల బరువును కొన్ని నెలల వ్యవధిలో తిరిగి కోల్పోవడమే కాదు. గంటల్లోనే జయలా మీకు చేరువవుతాను`` అని తెలిపారు. కంగన షేర్ చేసిన మూడు ఫోటోలు వేటికవే భిన్నంగా కనిపించాయి.
తలైవి ట్రైలర్ ఈనెల 23న విడుదలవుతోంది. ఏ.ఎల్.విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమ్మ జయలలిత పాత్రలో కంగన .. ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్- భాగ్యశ్రీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. బాహుబలి.. భజరంగి భైజాన్ చిత్రాలకు కథలు అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ తలైవి రచనా ప్రక్రియను పర్యవేక్షించారు. శైలేష్ఆర్ సింగ్ -విష్ణు ఇందూరి- బృందాప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.