Begin typing your search above and press return to search.

భారీ ధరకు అమ్ముడైన తలైవి హక్కులు.. ఓటిటి ఏదంటే?

By:  Tupaki Desk   |   5 Jun 2020 10:10 AM GMT
భారీ ధరకు అమ్ముడైన తలైవి హక్కులు.. ఓటిటి ఏదంటే?
X
తెలుగు తమిళ రాష్ట్రాలలో స్టార్ హీరోయిన్ గా పేరొంది.. తమిళనాడు సీఎం గా పదవి చేపట్టి ఐరన్ లేడీగా.. జయలలిత చరిత్రలోకెక్కింది. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు, అనూహ్య సంఘటనలు చాలానే ఉన్నాయి. అందుకే బయోపిక్ లు రూపొందించే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అయింది. ఇప్పుడు జయలలిత జీవితాన్నే కథాంశంగా బయోపిక్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 140 పైగా సినిమాల్లో కథానాయికగా విభిన్న పాత్రలు పోషించారు జయలలిత. తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘తలైవి’ అనే పేరు ఖరారు చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ‘మణికర్ణిక’ వంటి హిస్టారికల్ మూవీ తర్వాత రనౌత్ నటిస్తోన్న బయోపిక్ ఇదే.


ఈ సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్నారు. జయలలిత జీవితంలోని ప్రధాన అంశాలు ఈ సినిమాలో ఉంటాయట. పదహారేళ్ల వయసు నుండి ఆరు పదుల వయసు వరకూ మొత్తం నాలుగు దశలను తలైవి బయోపిక్ లో చూపించనున్నారు. ప్రస్తుతం 'త‌లైవీ' గురించి ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆ విషయాన్ని కంగ‌నా స్వయంగా చెప్పడం విశేషం. అదేమిటంటే.. తలైవి సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ భారీ ధ‌ర‌కు కొన్నాయట. ఐదు బాషలలో రూపొందుతున్న ఈ సినిమా హిందీ, త‌మిళ హక్కులను 55 కోట్ల‌కు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కొన్నాయని తెలిపింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ రెండింటికీ ప్ర‌సార హ‌క్కుల‌ను అమ్మార‌ట‌. కానీ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశాకే ఓటీటీల్లో విడుద‌ల చేస్తారని కొసమెరుపుగా చెప్పింది‌. అయితే ఈ సినిమా హక్కులు భారీ ధరకు అమ్ముడవడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.