Begin typing your search above and press return to search.
కంగన `సీత` అయితే.. రాముడు ఎవరు?
By: Tupaki Desk | 10 Sep 2021 6:18 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్ 3డి` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు-హిందీ భాషల్లో తెరకెక్కించి అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని అనువదించి రిలీజ్ చేయనున్నారు. పురాణేతితిహాసం `రామాయణం` ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రాముడు పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఇంకా పలువురు ఉత్తరాది..దక్షిణాది బిగ్ స్టార్స్ ఆదిపురుష్ లో భాగమయ్యారు.
ప్రస్తుతం ఆదిపురుష్ 3డి ఆన్ సెట్స్ ఉంది. అయితే తాజాగా సీత పాత్ర కోసం కంగనా రనౌత్ కూడా పోటీ పడుతున్నారు. మరి సీత పాత్ర ఇప్పటికే ఫుల్ ఫిల్ అయిన నేపథ్యంలో మళ్లీ పోటీ ఏంటి? అంటే కంగన పోటీ పోడేది `ఉమెన్ ఓరియేంటెడ్` సీతగా అని తెలుస్తోంది.
రామాయణంలో సీత పాత్రను మాత్రమే హైలైట్ చేస్తూ అదే టైటిల్ తో స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ స్క్రిప్ట్ ని సిద్దం చేస్తున్నారు. సీత పాత్రకు కేవలం కంగన మాత్రమే న్యాయం చేయగలదని ఆ పాత్రకు ఆమెకే ఆఫర్ చేసారుట. ఈ విషయాన్ని తలైవి ప్రమోషన్ లోకూడా కంగన రివీల్ చేసింది. రామాయణంలో ఎన్ని పాత్రలున్నా..సీత..రాముడు పాత్రలు ఎంతో ప్రత్యేకమైనవి. రామాయణం ఔన్నత్యాన్ని తెలియజేసే ఆ రెండు పాత్రలు చట్టూనే రామాయణం కథాంశం తిరుగుతుంది. అందుకే స్టార్ రైటర్ సీత పాత్రని హైలైట్ చేస్తూ సీత కథను రాస్తున్నారని తెలుస్తోంది. అలాగే సీత పాత్రతో పాటు లవ-కుశ పాత్రలు అంతే కీలకం. సీత భర్త రాముడు పాత్రకు ప్రాధాన్యం తప్పనిసరి.
`సీత` లో టైటిల్ పాత్ర కంగనకు దక్కితే.. రాముడు పాత్రధారి ఎవరు పోషిస్తారు? అన్నది చర్చనీయాంశంగా మారింది. సీత పాత్రను ఎంత హైలైట్ చేసినా రాముడు కారణంగా వనవాసం తప్పదు. ఆ సమయంలో రాముడి పాత్రలో నెగిటివ్ షేడ్ ని కూడా హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాముడి పాత్రకు ఎవరిని ఎంపిక చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆదిపురుష్ లో రాముడిగా నటిస్తోన్న ప్రభాస్ నే రంగంలోకి దింపితే ఎలా ఉంటుందున్న ఆలోచన మేకర్స్ కి తట్టే అవకాశం లేకపోలేదు. గతంలో కంగనా- ప్రభాస్ ఏక్ నిరంజన్ లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. కంగన నటించిన `తలైవి` నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా ప్రివ్యూ పరంగా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. సిసలైన రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంది.
తలైవికి అవార్డులు రివార్డులు గ్యారెంటీ!
నాటి మేటి అగ్ర కథానాయిక.. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న `తలైవి` నేడు (10 సెప్టెంబర్) రిలీజైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ జయలలిత పాత్ర పోషించగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్ లో నటించారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. తలైవి సినిమాను తమిళ్- తెలుగు- హిందీ భాషల్లో విడుదలైంది. విబ్రి మీడియా- కర్మ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ కెమెరా వర్క్ అందించారు.
తలైవి లో కంగన నటనకు అవార్డులు రివార్డులు దక్కుతాయని ఇదివరకూ నిర్మాతలు అన్నారు. ఈ సినిమాతో కంగనా రనౌత్ కి ఐదో జాతీయ అవార్డు వస్తుందని నమ్ముతున్నా. నేను నా జీవితంలో ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు.. ఈ సినిమా మరో ఎత్తు. ``ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ రావాలని తలైవి టైటిల్ పెట్టారు. విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టులోకి రాగానే దాని స్వరూపమే మారిపోయింది. ఆయన ఎంటర్ కాగానే జయలలిత క్యారెక్టర్ కోసం కంగనాకు తీసుకుందామని చెప్పారు. కంగనాకు తగ్గట్టుగా ఎంజీఆర్ క్యారెక్టర్ అరవింద్ స్వామిని ఫైనల్ చేశారు. తలైవిలో కంగన అభినయం అద్భుతంగా ఉండనుందని ఇంతకుముందు రిలీజైన ట్రైలర్ తో అర్థమైంది. కంగనకు జాతీయ స్థాయి అవార్డులు దక్కుతాయని అంతా అంచనా వేస్తున్నారు. కంగన తదుపరి ధాకడ్ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. తేజాస్ లో పైలెట్ పాత్రలో నటించనున్నారు.