Begin typing your search above and press return to search.
‘క్వీన్’ పొలిటికల్ ఎంట్రీ ఫైనల్.. ఆ స్టేట్ లో బ్యానర్లు ఏం చెబుతున్నాయ్?
By: Tupaki Desk | 22 Sep 2020 10:10 AM GMTఉత్తినే ఏవీ జరగవు. అందునా రాజకీయాల్లో అసలేం జరగవు. బయటకు వచ్చే ప్రతి అంశానికి సంబంధించి లోగుట్టుగా చాలానే పరిణామాలు చోటు చేసుకోవటం కామన్. బాలీవుడ్ క్వీన్ కమ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లు చెబుతున్నారు. అన్ కండీషనల్ గా బీజేపీ వాయిస్ ను వినిపించే ఆమె ధాటికి బాలీవుడ్ హీరోలు సైతం కామ్ గా ఉండటం తెలిసిందే.
అందరూ అనుకుంటున్నట్లుగా కంగనా బీజేపీలో చేరటం లేదంటున్నారు. ఒకవేళ.. అలా జరిగితే అందరి అంచనాలు నిజమైపోతాయి. అందుకే కాస్తంత ట్విస్టు ఇస్తూ.. ఆమె బీజేపీ మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తీర్థం తీసుకోనున్నారు. ఇదెక్కడి పార్టీ అంటారా? కేంద్రమంత్రి రాందాస్ అధవాలే గుర్తున్నారు కదా? ఈ మధ్యనే ముంబయిలోని కంగనా ఇంటికి వెళ్లి మరీ.. పరామర్శించి వచ్చారు కదా. ఆయన నడిపే పార్టీలో ఆమె చేరనున్నట్లు చెబుతున్నారు.
ఇంతకీ కంగనాను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? దాని వెనకున్న ప్లాన్ ఏమిటన్నది చూస్తే.. చాలానే లెక్కలు కనిపిస్తాయి. రాజ్ పుత్ వర్గానికి చెందిన కంగనాను పార్టీలోకి చేర్చుకోవటం ద్వారా.. వారి ఓటు బ్యాంకును సొంతం చేసుకునే వీలుంది. గుజరాత్.. రాజస్థాన్ లలో వారి ఓటు బ్యాంకు చాలా ఎక్కువ. అందుకే కంగన పొలిటికల్ ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య ఎపిసోడ్ లో మహారాష్ట్ర అధికారపక్షం ఇరుకున పడేలా కంగనా మాట్లాడటం.. ఆగ్రహం చెందిన ప్రభుత్వం ఆమె ఆఫీసులోని లోపాల్ని ఎత్తి చూపించటం తెలిసిందే.
యుద్ధ ప్రాతిపదికన ఆమె ఆఫీసును కూల్చేందుకు సిద్దం కావటం.. కోర్టు ఆదేశాలు వచ్చే నాటికి పాక్షికంగా కూల్చివేతలు జరిగిపోవటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను పలుకరించేందుకు ఆమె ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి రాందాస్.. ఆమెను పార్టీలో చేరాలని కోరటం.. అందుకు ఆమె దాదాపుగా సమ్మతించినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర లోని శివసేన సర్కారుకు బీజేపీకి పడని విషయం తెలిసిందే. బీజేపీ స్టాండ్ ను సమర్థవంతంగా వినిపించటంతో పాటు.. అధికార పక్షాన్ని ఇరుకున పడేయటంలో కంగనా సక్సెస్ అయ్యారని చెప్పాలి.
దీనికి బదులుగా ఇప్పటికే కంగనకు వై ప్లస్ భద్రతను కల్పించటం గమనార్హం. మహారాష్ట్రకు చెందిన అధవాలే పార్టీ అండ కంగనకు సంపూర్ణంగా ఉంటుందని.. అందుకు ప్రతిగా ఆమె పార్టీలో చేరితే బాగుంటుందన్న ప్రతిపాదనకు ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె పొలిటికల్ ఎంట్రీ దాదాపుగా ఖరారైందన్న ప్రచారం జరుగుతుందనగానే.. ఆ వాదనకు బలం చేకూరేలా రాందాస్ తో ఆమె భేటీ అయిన ఫోటోలు బ్యానర్లు.. ఫ్లెక్సీల రూపంలో దర్శనమివ్వటం గమనార్హం. త్వరలో జరిగే వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కంగన సేవలు వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోన్నట్లు చెప్పాలి. రాజస్థాన్.. గుజరాత్ లలో జరిగే స్థానిక ఎన్నికల్లో కంగనా ఛరిష్మా పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. మరి.. ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.