Begin typing your search above and press return to search.
నా చెస్ట్ పై బలంగా గుద్ది వెళ్లాడు : కంగనా
By: Tupaki Desk | 8 Jun 2019 10:00 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఉంటూ వస్తుంది. ముక్కు సూటిగా మాట్లాడటంతో పాటు ఎంతటి వారినైనా విమర్శించే తెగువ కంగనలో ఉంటుంది. అందుకే కంగనా ఇండస్ట్రీలో చాలా మందికి శత్రువు అయ్యింది. తాజాగా అమీర్ ఖాన్ నిర్వహించిన ఒక టాక్ షో లో స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకునే మరియు పరణీతి చోప్రాలతో కలిసి కంగనా పాల్గొంది. ఈ సందర్బంగా అమ్మాయిలు ఎదుర్కొనే లైంగిక వేదింపుల గురించి చర్చించారు.
కంగనా గతంలో మీటూ అంటూ తాను ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పలువురు తనను వాడుకోవాలని ప్రయత్నించారు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈసారి తాను స్కూల్ ఏజ్ లో ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి చెప్పుకొచ్చింది. చండీఘర్ లోని తన స్కూల్ కు వెళ్తున్న సమయంలో బైక్ పై నుండి అబ్బాయిలు వచ్చి అల్లరి చేస్తూ ఉండే వారు. ఒకడు తన వెనక నుండి స్పీడ్ గా వచ్చి నా చెస్ట్ పై బలంగా గుద్ది వెళ్లాడు అంటూ కన్నీరు పెట్టుకుంది.
ఆ సమయంలో నేను నన్ను ఎవరైనా అలా చూశారా.. అతడు నా చెస్ట్ పై చేయి వేసిన విషయం ఎవరైనా గమనించి ఉంటారా అని భయపడ్డాను అంటూ కంగనా చెప్పుకొచ్చింది. అలాంటి సమయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలదే తప్పు అంటారు. అందుకే తాను ఏం చేయాలో అర్ధం కాక అలాగే ఉండిపోయానంటూ కంగనా అప్పటి విషయాలను చెప్పుకొచ్చింది. లైంగిక వేదింపులను సమర్ధంగా ఎదుర్కొనేలా ఇప్పుడు అమ్మాయిలు తయారు అవుతున్నారంది.