Begin typing your search above and press return to search.
ట్విట్టర్ పై అలక.. ఇన్ స్టాపై కినుక.. ఏంటో కంగన!
By: Tupaki Desk | 12 Nov 2022 4:13 AM GMTఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్విటర్ పై అలక ప్రదర్శించిన కొన్ని నెలలకు ఇప్పుడు ఇన్ స్టాపైనా కినుక వహించింది. తనదైన శైలిలో ఈ భామ తాను ఇన్ స్టాగ్రామ్ తో ఎదుర్కొన్న సమస్యలను వర్ణిస్తూ ఎడాపెడా పంచ్ లు విసిరింది. ట్విట్టర్ నుంచి సస్పెన్షన్ తర్వాత కొంత గ్యాప్ అనంతరం ''మూగ ఇన్ స్టాగ్రామ్'' అంటూ ఫోటో షేరింగ్ మాధ్యమైంపైనా విరక్తిని ప్రదర్శించింది.
ఎవరు ఏ అభిప్రాయాన్ని రాసినా మరుసటి రోజు అదృశ్యమవుతుంది. అయినా మనం రాసేది అందరూ చదవాలి కదా.. అందరూ ఒకేలా ఉంటారా? కొందరు ఆలస్యంగా చదువుతారు. అప్పటివరకూ అది ఉండదు. అదృశ్యమవుతుంది! అంటూ తన అసహనాన్ని ప్రకటించింది. కంగనా రనౌత్ ఇన్ స్టాగ్రామ్ వేదికగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. దానిని మూగ వేదికగా కూడా పేర్కొంది.
నిజానికి కంగనా రనౌత్ ఒక అద్భుతమైన నటిగానే కాదు..చిత్ర పరిశ్రమలో అత్యంత వివాదాస్పద నటిగాను రాటు దేలింది. పురుషాధిక్య ప్రపంచానికి ఎదురెళ్లే గట్స్ ఉన్న ఈ భామ సామాజిక మాధ్యమాల తీరుతెన్నులపైనా వాటి నిర్వాహకులపైనా విరుచుకుపడుతుండడం చూస్తున్నదే. ప్లాట్ ఫామ్ ఏదైనా వివాదాస్పద ప్రకటనలతో నిరంతరం కంగన సంచలనంగా మారుతోంది. ఇంతకుముందు ట్విట్టర్ నుండి సస్పెండ్ అయిన కంగన.. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ ను మూగ వేదిక అంటూ అసహనం ప్రదర్శించడంతో మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
కంపెనీ మార్గదర్శకాల ప్రకారం అనుమతించబడని తన రాజకీయ అభిప్రాయాలను షేర్ చేసినందుకు కంగనా రనౌత్ గత సంవత్సరం ట్విట్టర్ నుంచి సస్పెండ్ అయింది. అప్పట్లోనే కంగన తన అలకను తన మాటల్లోనే ప్రదర్శించింది. ''ట్విట్టర్ ప్రస్తుతం ఉన్న ఉత్తమ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్.. ఇది మేధోపరంగా.. సైద్ధాంతికంగా ప్రేరేపించబడే మాధ్యమం. లుక్స్ లేదా లైఫ్ స్టైల్ గురించి కాదు. కానీ కొన్ని సమస్యలున్నాయి. ఇతరులకు ప్రామాణికమైన ఉనికి లేనట్లుగా ఎంపిక చేసుకున్న కొందరు మాత్రమే పొందే ధృవీకరించే వారి ఆలోచనను నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయాను. ఉదాహరణకు, నేను ధృవీకరించబడతాను... కానీ నా తండ్రికి బ్లూ టిక్ కావాలంటే ముగ్గురు నలుగురు విదూషకులు అతను చట్టవిరుద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారని చెబుతూ అతని గుర్తింపును తీసివేస్తారు'' అని వ్యాఖ్యానించింది.
ఏడాది తిరగకుండానే కంగనా రనౌత్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ పై ఫైర్ అయ్యింది. ఇది మూగ మాధ్యమం అని కౌంటర్లు వేస్తూ అనూహ్యంగా ట్విట్టర్ ను ప్రశంసించింది. ఆమె తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఒక నోట్ ను రాసింది. అందులో ''మూగ" Instagram'' అని ఇది కేవలం ఫోటోల కోసమేనని పేర్కొంది. ఇక్కడ ఒకరు వ్రాసిన అభిప్రాయం మరుసటి రోజు అదృశ్యమవుతుంది. మనం చెప్పిన ప్రతిదానిని అర్థం చేసుకునే వాటిని పరిశోధించడానికి శ్రద్ధ వహించే వ్యక్తుల కోసం వారి ఆలోచనలను డాక్యుమెంట్ చేయాలనుకునే తనలాంటి వ్యక్తులకు ఈ వేదిక ఎలా పనికిరాదో వర్ణించింది.
కంగన ఇంకా ఇలా రాసింది. ''మూగ ఇన్ స్టాగ్రామ్ ఫోటోల కోసం మాత్రమే. ఎవరైనా ఏ అభిప్రాయాన్ని రాసినా అది మరుసటి రోజు అదృశ్యమవుతుంది. అందరూ చంచలమైన పనికిమాలిన డంబోలా తరహాగా ఉంటారు. ఎవరైనా కానీ ఒక రోజు ముందు రాసిన వాటిని చూడటానికి ఇష్టపడరు.. ఎందుకంటే అవి ఏమైనప్పటికీ అర్థం కావు. ఇంతలోనే వారు చెప్పేది కూడా అదృశ్యమవుతుంది. అయితే మనలో కొందరి సంగతేమిటంటే.. వారు చెప్పే ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు. వ్యక్తుల కోసం వారి ఆలోచనలను డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నారు. వాటిని లోతుగా పరిశోధించడానికి సంభాషణను ప్రారంభించే వీలుండదు'' అని అంది. మినీ బ్లాగులను సబ్జెక్ట్ -ఆబ్జెక్ట్ రెండింటి వివరణల కోసం తెరవాలని కూడా సూచించింది. కంగన నటించిన ధాకడ్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ఎమర్జెన్సీ టైటిల్ తో ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.