Begin typing your search above and press return to search.
విజయేంద్ర ప్రసాద్ పద్మవిభూషణ్ కు అర్హుడు!- కంగన
By: Tupaki Desk | 2 April 2022 10:31 AM GMTరచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ పద్మవిభూషణ్ కు అర్హుడని ప్రశంసించారు క్వీన్ కంగన రనౌత్. ఎస్‌ఎస్ రాజమౌళిని కింగ్ అని అని కూడా సంబోధించడం చర్చనీయాంశమైంది. SS రాజమౌళి తెరకెక్కించిన సినిమాటిక్ వండర్ RRR థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ 700 కోట్ల క్లబ్ నుంచి 1000 కోట్ల క్లబ్ వైపు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఈ సినిమా సామాన్యులనే కాకుండా ప్రముఖుల హృదయాలను కూడా కొల్లగొడుతోంది. సల్మాన్ ఖాన్ - కరణ్ జోహార్ ఈ చిత్రం గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొనడంతో క్రేజ్ మరింత పెరిగింది.
ఆపై విడుదలకు ముందు అమీర్ ఖాన్ వచ్చి RRR కి మద్దతునివ్వడం మరింత ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఇటీవల కంగనా రనౌత్ తన సోషల్ మీడియాలో ఏకంగా ప్రశంసల ఝడివాన కురిపించారు. ఇంత గొప్ప చిత్రాన్ని రూపొందించినందుకు RRR' బృందాన్ని ప్రశంసిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు.
ఈ చిత్రానికి ప్రమోషన్స్ అవసరం లేదు. ఇది అన్ని రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఇది దేశభక్తి - ఐక్యత భావాలతో నిండి ఉంది. ఇది మంచి కళ.. సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. ఏ భారతీయుడైనా ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ప్రశంసించాలని కోరుకుంటారు. ఈ సినిమా ఇద్దరు నిజ హీరోల కథ. మన స్వాతంత్య్ర సమర కాలంలో ఇంకా ఎందరో బయటకు తెలియని హీరోలు ఉంటారా? అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. నేటి యుగంలో కూడా పెద్దగా మాట్లాడని హీరోలు ఎందరో ఉన్నారు.. ఈ చిత్రానికి రచయిత శ్రీ కె.వి.విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. మాకు అనేక విశేషమైన సినిమాలకు కథలు ఇచ్చారు ఆయన. 80 ఏళ్ల వయస్సులో అతను భారతదేశంలోని అత్యంత బిజీ రచయితలలో ఒకరిగా ఉన్నారు. అతను 15 రోజుల్లో కథలు రాస్తారు. అయితే ఇతరులు ఒక కథను పూర్తి చేయడానికి 6 నెలల ఒక సంవత్సరం తీసుకుంటారు. మీరు అతనిని కలిసినప్పుడు ఉద్వేగభరితంగా ఉంటారు. పద్మవిభూషణ్ కి అర్హులు ఆయన.. అది తన అవసరం కాదు.. యువత అవసరం.. పరిశ్రమలో ఇలాంటి వారు మరింత మంది కావాలి`` అని క్వీన్ ప్రశంసల్లో ముంచెత్తారు.
RRR లో ప్రతి నటుడు చాలా బాగా నటించారు. అది ఎన్టీఆర్ జీ .. రామ్ చరణ్ జీ కావచ్చు. నేను దర్శకుడు SS రాజమౌళి గురించి మాట్లాడేటప్పుడు నాకు మాటలు రావడం లేదు.. అతను రాజు లాంటివాడు.. నేను చెప్పేదంతా ``రాజుగారితో జీవించు..`` అనే. ధన్యవాదాలు... RRR కోసం.. అంటూ క్వీన్ పొగిడేశారు.
భారతదేశంలో అత్యంత విజయవంతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా ఆర్.ఆర్.ఆర్ సంచలనాలు సృష్టిస్తోంది. ఇంతకాలం వేచి చూసి ఇప్పుడు రిలీజ్ చేసినందుకు సరైన సమయాన్ని ఎంచుకున్నారని కూడా ప్రూవ్ అయ్యింది. దక్షిణాది నుండి మాత్రమే కాకుండా ఉత్తరాదిన ఇతర మార్కెట్ల నుండి కూడా ఈ చిత్రానికి ప్రశంసలు కురుస్తున్నాయి. వసూళ్లు అంతే అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇది సిసలైన పాన్ ఇండియా చిత్రం. RRR విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద అద్భుత ఫలితాలను చూపుతోంది. ఈ చిత్రం అత్యంత వేగంగా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. పోస్ట్-పాండమిక్ 5 రోజులలోపు భారీ వసూళ్లతో సంచలనాలు సృష్టించి ఇప్పటికీ గొప్ప వసూళ్లను సాధిస్తోంది.
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను నిర్మించారు. 25 మార్చి 2022న సినిమా విడుదలైంది. వారం తర్వాతా అద్భుత వసూళ్లను సాధిస్తోంది. క్వీన్ కంగన రాజమౌళిని కింగ్ అంటూ ఆశీర్వదించడమే గాక.. విజయేంద్రునికి ఏకంగా పద్మవిభూషణ్ ఇవ్వాలని కోరింది. తద్వారా చాలా మంది తెలుగు కథానాయికలు లేదా హీరోలు లేదా ఇతరుల కంటే బెటర్ థింకర్ అని నిరూపించింది. ఒక తెలుగు వాడికి ఇది గర్వకారణం. కంగన నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉందని అంతా అంగీకరించాలి.