Begin typing your search above and press return to search.

వారసత్వంపై టాప్‌ హీరోయిన్‌ సంచలన కామెంట్స్‌

By:  Tupaki Desk   |   30 March 2019 1:30 AM GMT
వారసత్వంపై టాప్‌ హీరోయిన్‌ సంచలన కామెంట్స్‌
X
ఎప్పుడు ఏదో ఒక వివాదంతో మీడియాలో ఉండే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. కెరీర్‌ ఆరంభంలో పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకున్న ఆమె ఆ తర్వాత తనకు తాను ఎదిగిన తీరును చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తనపై జరిగిన లైంగిక వేదింపులు మరియు కొన్ని దాడులను ఆమె చెప్పుకొచ్చింది. అదే ఇంటర్వ్యూలో వారసత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన పిల్లలకు అసలు వారసత్వం అనేది తాను ఇవ్వను అంటూ చెప్పుకొచ్చింది.

తన పిల్లలను సముద్రంలో అయినా వేస్తాను కాని వారిని నా వారసులుగా ఇండస్ట్రీలోకి తీసుకు రాను అంటూ చెప్పుకొచ్చింది. వారు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకునేందుకు ఒక తల్లిగా వారికి సాయం చేస్తాను - వారు ఎంపిక చేసుకున్న రంగంలో రాణించేలా నైపుణ్యాలు నేర్పిస్తాను. అంతే తప్ప వారి భవిష్యత్తును నేను దగ్గర ఉండి తీర్చి దిద్దను. నా పిల్లలుగా వారు ఎక్కడ కూడా చెలామని అవ్వకుండా పెంచుతాను. పూర్తిగా వారి కష్టంతోనే పెరిగేలా - వారి కష్టంతో కెరీర్‌ లో రాణించేలా వారికి శిక్షణ ఇప్పిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

నా తమ్ముడు ఉద్యోగం కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడికి నేను తల్చుకుంటే ఏదైనా జాబ్‌ లో పెట్టించగలను, కాని అతడి కాళ్లపై అతడు నిలబడాలనే ఉద్దేశ్యంతో నేను సాయం చేయడం లేదు అంటూ కంగనా చెప్పుకొచ్చింది. సొంత కాళ్లపై నిలబడ్డప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. అందుకే నేను నా వారసులకు కూడా కెరీర్‌ లో హెల్ప్‌ చేయాలనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న హీరోలు చాలా మంది కూడా వారసులే అయిన నేపథ్యంలో వారికి కౌంటర్‌ గా కంగనా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటుందనే టాక్‌ మొదలైంది.