Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అర‌విరిసిన న‌ల్ల గులాబీలా

By:  Tupaki Desk   |   11 May 2018 11:52 AM GMT
ఫోటో స్టోరి: అర‌విరిసిన న‌ల్ల గులాబీలా
X
ప్ర‌తిష్ఠాత్మ‌క కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఫ్రాన్స్‌లో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి పేరెన్నిక‌గ‌న్న న‌టులు న‌టీమ‌ణులు రెడ్ కార్పెట్ పై న‌డిచే ప్ర‌ముఖ వేడుక ఇది. మే 8న మొద‌లైన ఈ వేడుక మే 19 వ‌ర‌కు కొన‌సాగుతుంది. కేన్స్‌కు ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌కు చెందిన సినీ ప్ర‌ముఖులెందోరో హాజ‌ర‌య్యారు. ఈసారి తొలిసారిగా కంగనాకు అవ‌కాశం వ‌చ్చింది. అలాగే దీపికా ప‌దుకునే కూడా హాజ‌రైంది. ఐశ్వ‌ర్య కూడా కేన్స్ వేడుక‌కు బ‌య‌లుదేరింది.

కంగ‌నా వ‌చ్చిన అవ‌కాశాన్ని ఏమాత్రం వ‌దులుకోలేదు. అంత‌ర్జాతీయ వేదిక‌పై అందంగా మెరిసిపోయింది. తొలిసారి పాల్గొన్న‌ప్ప‌టికీ ఎక్క‌డా త‌డ‌బాటు ప‌డ‌లేదు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌ జుహైర్‌ మురాద్‌ డిజైన్‌ చేసిన మెరుపుల‌ గౌనులో ఫోటోల‌కు ఫోజులిచ్చారు. హెయిర్ క‌ట్‌తో కూడా ఆక‌ట్టుకున్నారు. అనంత‌రం న‌ల్ల‌టి చీర‌లో కేన్స్ వీధుల్లో షికార్లు కొట్టారు. ఆమే మేక‌ప్ రూములోని ఫోటోలు ఆన్‌లైన్‌లోకి వ‌చ్చాయి. న‌ల్ల‌టి చీర‌లో అర‌విరిసిన న‌ల్ల గులాబీలా ఉంది కంగ‌నా. చిన్న చెమ్కీల చీర‌లో స్లీవ్ లెస్ బ్ల‌వుజులో అందంగా మెరిసింది. సన్న‌జాజి తీగ‌లాంటి కంగ‌నాకు ఏ డ్రెస్ అయినా ఇట్టే న‌ప్పేస్తుంది.

ప్ర‌స్తుతం ఫ్రాన్స్ లో జ‌రుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్ట‌వ‌ల్ 71వ‌ది. దీనికి ఇండియా నుంచి ఎక్కువ మందికే ఆహ్వ‌నాలు అందిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే దీపికా కంగ‌నా మ‌ల్లికా శెరావ‌త్‌ చేరుకున్నారు. ఐశ్వ‌ర్య రాయ్ త‌న కూతురుతో రేపు కేన్స్‌కు చేరుకుంటుంది. ధ‌నుష్ హ్యూమా ఖురేషీ నవాజుద్దీన్‌ సిద్ధిఖి కూడా హాజరుకానున్న‌ట్టు స‌మాచారం. కొత్త పెళ్లి కూతురు సోన‌మ్ కూడా హాజ‌రుకానుంద‌ని తెలుస్తోంది.