Begin typing your search above and press return to search.

వామ్మో!! కేన్స్ లో క్వీన్ రచ్చచేసేసింది

By:  Tupaki Desk   |   11 May 2018 5:03 PM GMT
వామ్మో!! కేన్స్ లో క్వీన్ రచ్చచేసేసింది
X
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటేనే ఫుల్లు క్రేజ్. 2018లో కూడా ఈ ఫ్రాన్స్ వేడుక అంగరంగవైభవంగా జరుగుతోంది. ఎందరెందరో అందాల భామలు ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారు. దేశదేశాల నుంచి వయ్యారి భామలు అందరూ వచ్చి.. తమ సోయగాలను ఆరబోస్తున్నారు.

కేన్స్ కు తొలిసారిగా వచ్చిన బాలీవుడ్ క్వీన్.. తన మొదటి ఎంట్రీలోనే అదరగొట్టేసింది. బాలీవుడ్ రాణి అనిపించుకున్న ఈ భామ.. ఎప్పుడు ఎక్కడ ఎంతవరకూ ఎక్స్ పోజ్ చేయాలనే అంశంపై బాగా పండిపోయింది. అందుకే తన సెక్సీ అవతారాన్ని స్టైలిష్ గా చూపించేసింది ఈ సుందరాంగి. కేన్స్ కు వెళుతూనే స్టైల్ కు సోయగాలను రంగరించి అదరగొట్టేసింది. క్లీవేజ్ షో చేస్తూ అదరగొట్టడం ఈ అమ్మడికి అలవాటే కానీ.. మరీ ఇంతగా పరాయి దేశానికి వెళ్లి మరీ మెరుపులు చూపించడం మాత్రం చెప్పుకోవాల్సిన విషయం.

పైన లైట్ కలర్ సూట్ ధరించింది కానీ.. లోపల మాత్రం డార్క్ కలర్ ఇన్నర్ వేర్ మాత్రమే ధరించి క్లీవేజ్ షో చేస్తూ సెక్సీ చూపులతో చంపేసింది కంగనా రనౌత్. మిలిటరీ గ్రీన్ ప్యాంట్ తో అమ్మడు ఆరేసిన అందాలు ఎవరినైనా ఎట్రాక్ట్ చేయాల్సిందే. నన్ను ఇవాళ రెడ్ కార్పెట్ పై చూడండి అంటూ ముందే ఊరించేసి మరీ బయల్దేరిన ఈ భామ.. అక్కడ ఇంకెన్ని మెరుపులతో అభిమానులను టెంప్ట్ చేయనుందో చూడాలి.


మరిన్ని ఫోటో చూడటానికి క్లిక్ చేయండి