Begin typing your search above and press return to search.
సిగ్గు లేనోళ్లు: క్రిష్ తర్వాత అమీర్ పై ఎటాక్!
By: Tupaki Desk | 6 Feb 2019 1:30 AM GMTక్వీన్ కంగన దుమారం గురించి ఏమని చెప్పాలి? ఎదుటివాడు ఎంతటివాడైనా దొరకబుచ్చుకుని చెడామడా తిట్టేయడం తన స్టైల్. మాటల తూటాల్ని పేల్చుతూ కత్తి దూయడంలో కంగన తర్వాతే. హృతిక్ రోషన్, రాకేష్ రోషన్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, ఆలియా భట్, అస్రానీ, క్రిష్ .. ఒకరేమిటి వీళ్లంతా క్వీన్ కంగన బాధితులే. కొందరిని నెప్టోయిజం(నటవారసులు) పేరుతో ఆడుకుంది. మరికొందరిపై ఎఫైర్ పేరుతో కక్ష తీర్చుకుంది. ఇంకొందరిని కాపీ రైట్స్, క్రియేటివిటీ రైట్స్ అంటూ అల్లాడించింది. ఇప్పుడు ఏకంగా దర్శకత్వంలో క్రెడిట్స్ అంటూ క్రిష్ తో కూడా ఆడుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్లపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో హాట్ డిబేట్ రన్ అయ్యింది. ఈలోగానే మరికొందరిని దొరకబుచ్చుకుని ఓ ఆటాడుకుంది కంగన. అందుకే తనని అందరూ క్వీన్ అని పిలుస్తారని మరోసారి ప్రూవైంది.
ఈసారి మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్, యంగ్ బ్యూటీ ఆలియా భట్, అనురాగ్ కశ్యప్ వంటి వాళ్లను చెడామడా కడిగేసింది. కొందరు సిగ్గు లేకుండా తమ సినిమాల ప్రచారం కోసం పిలుస్తారు. ప్రచారం చేయండి అని అడిగేస్తారు. కానీ నా సినిమాల ప్రమోషన్ వరకూ వచ్చేసరికి ఎవరూ సాయానికి ముందుకు రారు. నా సినిమా హిట్టయినా ఆ క్రెడిట్ నాకు దక్కకుండా చేసిన దర్శకనిర్మాతలు ఉన్నారు. `క్వీన్` రిలీజ్ సమయంలో ఇదే జరిగింది. 2014లో క్వీన్ హిట్టయినా అనురాగ్ కశ్యప్, వికాస్ వంటి వారికి మాత్రమే పేరొచ్చింది కానీ నన్నెవరూ పట్టించుకోలేదు. తను వెడ్స్ మను ప్రివ్యూ వేస్తే చాలా మందిని పిలిచినా రాలేదు. అదే వాళ్ల అవసరం వచ్చినప్పుడు సిగ్గు లేకుండా ఫోన్ లు చేసి పిలుస్తారు. కొన్నిసార్లు షూటింగులు క్యాన్సిల్ చేసుకుని మరీ వెళ్లేదానిని. కానీ ఇప్పుడు అలా వెళ్లడం మానుకున్నాను.. అంటూ క్వీన్ చెడామడా ఉతికి ఆరేసింది.
ఇందులో మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి ఓ రేంజులో కోటింగ్ పడింది. నువ్వు ఖాన్ అయితే నేనే క్వీన్! అన్న తీరుగా కంగన చెలరేగిన తీరు విస్మయం కలిగించక మానదు. దంగల్ - సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాల కోసం అమీర్ కాల్ చేస్తే అంబానీ ఇంటికి వెళ్లి ప్రివ్యూ చూశాను. కానీ నా సినిమా చూడటానికి మాత్రం సమయం లేదు ఆయనకు.. అని తిట్టేసింది. ఇక రాజీ ట్రైలర్ పంపి ప్లీజ్ చూడండి అని ఆలియా భట్ కోరింది. కానీ నా సినిమా ప్రచారానికి రాదు.. అని అంది. ఆలియా .. కరణ్ ల సినిమా కాదు రాజీ... దేశం కోసం తీసిన సినిమా మాత్రమేనని కంగన వేరొక కొత్త కోణాన్ని నొక్కి వ్యాఖ్యానించింది. మొత్తానికి కంగన బ్లాస్ట్ మామూలుగా లేదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 1000 కేజీల ఆర్డీఎక్స్ ఒకేసారి పేల్చినట్టు శత్రువుల్ని తూట్లు పొడిచిందని భావించవచ్చు.