Begin typing your search above and press return to search.
METOO: క‌్వీన్ ఆ దర్శకుడిపై విరుచుకుపడింది!
By: Tupaki Desk | 2 Jun 2019 9:44 AM GMTమీటూ ఉద్యమం పర్యవసానం ఇప్పటికీ సినీపరిశ్రమల్లో చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది మీటూ వేదికగా పలువురు నటులు- దర్శక నిర్మాత లపై బాధిత కథానాయికలు ఆరోపించారు. కొందరిపై ఫిర్యాదులు చేయడంతో కోర్టుల పరిధిలో విచారణ సాగింది. ముఖ్యంగా బాలీవుడ్ లో సీనియర్ నటుడు అలోక్ నాథ్ - స్టార్ డైరెక్టర్ వికాస్ బాల్ వంటి వారిపై ఇప్పటికీ ఈ వివాదం నడుస్తూనే ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ మీటూ వేదికగా దర్శకుడు వికాస్ బాల్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే గాక.. అతడు తనని లైంగికంగా వేధించాడని ఆరోపించారు. క్వీన్ చిత్రీకరణ సమయంలో తనని వేధించాడని.. ``నీ ఒంటి వాసనను నేను లవ్ చేస్తాను`` అంటూ తనని సెక్సువల్ గా వేధించాడని కంగన ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. దాంతో హృతిక్ రోషన్ `సూపర్ 30` నుంచి అతడిని తప్పిస్తున్నామని రియలన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రకటించడం సంచలనమైంది.
అంతేకాదు.. సూపర్ 30 టీమ్ అంతర్గత ఫిర్యాదుల విచారణ కోసం ఓ కమిటీని వేసింది. వికాస్ బాల్ తప్పు చేశాడా లేదా? అన్నదానిపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో వికాస్ తప్పేమీ లేదని అతడి పేరును టైటిల్స్ లో వేయాలా వద్దా? అన్నది ఆలోచిస్తున్నామని రిలయన్స్ సంస్థ ప్రతినిధి శిభాషిస్ సర్కార్ ప్రకటించడం తో .. ఈ తీర్పు తమను కలతకు గురి చేసిందని కంగన సోదరి రంగోలి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపుల రాక్షసులపై ఇలా క్లీన్ చిట్ ఇస్తారా? అంటూ కంగన్ సోదరి రంగోలీ సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోసింది. ``అసలు ఆడవాళ్లు ఇలాంటి వేధింపుల్ని బయటకు చెప్పడాన్నే సిగ్గులేని పనిగా భావిస్తారు. అలా సిగ్గు వదిలేసి బయటపడినా కానీ క్లీన్ చిట్ ఇచ్చి వదిలేస్తున్నారు. అలోక్ నాథ్ ఆ తర్వాత వికాస్ బాల్ ని వదిలేశారు`` అంటూ తిట్టినంత పని చేసింది. ``ఈ ప్రపంచానికి సమాంతరంగా వేరొక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో ఆడపిల్ల ఏడుపు వినపడకుండా శిక్ష ఉంటుంది..`` అంటూ తనలోని ఆవేదనను వ్యక్తం చేసింది.
క్వీన్ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. కంగన నటనకు జాతీయ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. అంత గొప్ప సినిమాని ఇచ్చిన దర్శకుడు వికాస్ తనని వేధించారని ఆరోపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇక వికాస్ బాల్ కి అమ్మాయిల పిచ్చి ఉందని.. 2014లోనే అతడికి పెళ్లయ్యింది. ప్రతి సారి అతడు క్యాజువల్ సెక్స్ కోసం మగువల్ని మార్చేస్తాడని కంగన తీవ్రమైన ఆరోపణల్నిచేయడం సంచలనమైంది. పెళ్లి గురించి వ్యాఖ్యానించను కానీ అమ్మాయిల అడిక్షన్ జబ్బు గా మారడం ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు కంగన. 2015లో వికాస్ బాల్ సొంత కంపెనీ ఫాంటమ్ ఫిలింస్ లోని ఓ మహిళా ఉద్యోగి తనపై ఆరోపణలు చేయడంతో అటుపై భాగస్వాముల మధ్య గొడవలు వచ్చి కంపెనీని మూసేసిన సంగతి తెలిసిందే.